టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా గాయం కారణంగా ప్రపంచ కప్ మ్యాచ్ లకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆయన ఎడమ చీలమండలో గాయమైంది. దీంతో బెంగళూరులోని NCAలో చికిత్స తీసుకుని ప్రస్తుతం నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే.. హార్ధిక్ పాండ్యా త్వరలోనే తిరిగి జట్టులోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు కూడా దూరం కానున్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా కోలుకున్నప్పటికి టోర్నీ సెకెండాఫ్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టు మేనెజ్‌మెంట్ అతడికి రెస్ట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు టాక్.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నాడు. అదే విధంగా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హజరీలో పాండ్యానే భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. టీ20ల్లో అయితే గత కొన్ని సిరీస్‌ల నుంచి నాయకత్వం వహిస్తున్న హార్దిక్.. జట్టును విజయ పథంలో తీసుకెళ్తున్నాడు.