మహిళలపై లైంగిక వేధింపులు, దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లికి సిట్ పోలీసులు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణను విచారించేందుకు శుక్రవారం ఐపీసీ సెక్షన్లు 64(A), 365, 109, 120(B) కింద సిట్ నోటీసులు ఇచ్చింది. తమ విచారణ కోసం భావానీ రేవణ్ణ హోలెనర్సీపూర్‌లోని వారి నివాసంలోనే జూన్ 1న సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో దర్యాప్తు బృందం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Uttarpradesh : ఎగ్ రోల్ డబ్బులు అడిగిన యజమానిని పిట్ బుల్ కుక్కతో కరిపించిన కస్టమర్
శుక్రవారం తెల్లవారుజామున జర్మనీ నుంచి భారత్‌కు వచ్చిన ప్రజ్వల్ రేవణ్ణను సిట్ పోలీసులు బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయన్ను విచారణ కోసం సీఐడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. విచారణలో భాగంగా ప్రజ్వల్‌కు పొటెన్సీ పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ప్రజ్వల్ రేవణ్ణకు పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. బెంగళూరులోని లేడీ కర్జన్ ఆస్పత్రిలో వైద్య టెస్టులు చేశారు. కాసేపట్లో ప్రత్యేక కోర్టులో సిట్ హాజరుపర్చనుంది. ప్రజ్వల్ రేవణ్ణను కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ వేయనుంది. ప్రజ్వల్ రేవణ్ణను తరలించే వాహనంలో లేడీ ఎస్కార్ట్స్ ఉన్నారు. మహిళా భద్రతకు ఢోకా లేదని చెప్పడానికే ప్రజ్వల్ చుట్టూ మహిళా ఆఫీసర్లను పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Delhi: ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఎయిర్ ఇండియా
ప్రజ్వల్ రేవణ్ణ.. ఎన్డీయే కూటమి తరఫున హాసన్ నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో ఏప్రిల్‌లో దేశం విడిచి పరారయ్యారు. ఇప్పటివరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి. నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ బహిరంగానే కోరారు. ఎట్టకేలకు ప్రజ్వల్ ఇండియాకు వచ్చి సరెండర్ అయ్యాడు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: సెయింట్ మేరీస్ స్కూల్‌లో సీఎం రేవంత్ రెడ్డి..