CM Revanth Reddy: సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ స్కూల్‌లో రిటైర్డ్ ఆర్చ్ బిషప్ తుమ్మబాల భౌతికకాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. సమాజ నిర్మాణంలో తూముంబల ఎనలేని సేవలందించారన్నారు. ప్రజలకు శాంతి, మత సామరస్యం, విద్యను అందించారన్నారు. వ్యక్తిగతంగా తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు.
Read also: CPI Narayana: తెలంగాణలో రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నాడు
కాగా.. 2019 ఎంపీ ఎన్నికల్లోనూ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమను మంచి మనసుతో ఆశీర్వదించారని చెప్పారు. వారి ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఆయన మరణం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు. వారి సేవలను కొనియాడుతూ.. వారి సందేశం స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ఆయన సేవలు మరవలేనివి అన్నారు. ఇన్నిరోజులు ఆయన ఇచ్చిన సందేశాన్ని అందరూ పాటించి ముందుకు సాగాలని సీఎం తెలిపారు.
Viral video: నడిరోడ్డుపై బర్త్ డే సెలబ్రేషన్స్.. వాహనదారులకు ఇక్కట్లు