Prajwal Revanna: మహిళపై అత్యాచారం చేసిన కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూర్ కోర్టు ‘‘జీవిత ఖైదు’’ శిక్షను విధించింది. తన ఇంట్లో పనిచేసే మహిళపై అత్యాచారం చేయడంతో పాటు ఆ చర్యని వీడియో తీసి, పదే పదే లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది. దీంతో కోర్టు అతడికి జీవితఖైదు శిక్షను విధించింది. రూ. 524 నెలవారీ వేతనం కోసం 8 గంటల పాటు రోజూవారీ పని చేయాలని ఆదేశించింది.
Prajwal Revanna: గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో సంచలనంగా మారిన ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ఈ రోజు కోర్టు తీర్పు వెల్లడించింది. అత్యాచారం కేసులో కోర్టు అతడికి ‘‘జీవితఖైదు’’ విధించింది. ప్రజ్వల్ రేవణ్ణపై ఆయన ఇంట్లో పనిచేసే మహిళ అత్యాచారం కేసు పెట్టింది. ఈ కేసులో ఆయనను బెంగళూర్ కోర్టు దోషిగా తేల్చింది.
Prajwal Revanna: గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో జేడీయూ మాజీ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కేసులు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మహిళలపై అత్యాచారం చేసి, వీడియోలు తీసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రేవణ్ణ ఇంట్లో పని చేసే 42 ఏళ్ల మహిళ తనపై ప్రజ్వల్ రేవణ్ణ, అతడి తండ్రి హెచ్‌డీ రేవణ్ణ లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది.
Prajwal Revanna: జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో సిట్ దూకుడు పెంచింది. అతడిపై మూడో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వందలాది సె*క్స్ వీడియోలు వెలుగులోకి వచ్చాయి. హసన్ జిల్లాలో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.
HD Kumaraswamy: కర్ణాటకలో బీజేపీ, మిత్రపక్షం జేడీఎస్ మధ్య విభేదాలు చెలరేగాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణికి సంబంధించి మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేజీ బెంగళూర్ నుంచి మైసూర్ వరకు పాదయాత్ర పిలుపునిచ్చింది.
మరో మహిళ ప్రజ్వల్ రేవణ్ణపై సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకు అడ్మిషన్ కోసం వెళ్లిన గృహిణిని ప్రజ్వల్ రేవణ్ణ లైంగికం వేధించినట్లు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రజ్వల్‌పై ఇప్పటి వరకు నలుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని స్కూల్‌లో చేర్పించేందుకు సాయం చేయాలని, అప్పటి జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్‌ని కోరినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
Prajwal Revanna : పలువురు మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జ్యుడీషియల్ కస్టడీని బెంగళూరు కోర్టు మంగళవారం మరో 14 రోజుల పాటు పొడిగించింది. 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అతని కస్టడీని పొడిగించింది. ఆ తర్వాత కర్ణాటక పోలీసుల సిట్ అతన్ని పరప్పన అగ్రహార జైలుకు తరలించనుంది. 33 ఏళ్ల మాజీ జేడీ(ఎస్) ఎంపీని మే 31న జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపేగౌడ…
Prajwal Revanna Case: ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల వ్యవహారంలో ఐఫోన్ కీలకంగా మారింది. ఈ ఫోన్ ద్వారానే లైంగిక చర్యల్ని ప్రజ్వల్ వీడియో తీశారని పోలీసులు భావిస్తున్నారు.
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల కేసులో విచారణను వేగవంతం చేసింది సిట్. నిన్న జర్మనీ నుంచి బెంగళూర్ వచ్చిన ప్రజ్వల్‌ని ఎయిర్ పోర్టులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి 6 రోజుల సిట్ కస్టడీకి అప్పగించింది.
సెక్స్ టేపుల కుంభకోణంలో ఇండియా నుంచి జర్మనీ వెళ్లిపోయిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున ఇండియాకు వచ్చాడు. బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు అక్కడే అరెస్ట్ చేశారు. కాగా.. ప్రజ్వల్ రేవణ్ణను సాధారణ వైద్య పరీక్షల కోసం నగర ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత రిమాండ్ విచారణ కోసం కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో 6 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో రేపటి నుంచి…