మహిళలపై లైంగిక వేధింపులు, దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లికి సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణను విచారించేందుకు శుక్రవారం ఐపీసీ సెక్షన్లు 64(A), 365, 109, 120(B) కింద సిట్ నోటీసులు ఇచ్చింది.