తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులకు సుస్తి చేసింది. సీజనల్ వ్యాధులకు తోడు విష జ్వరాలు విజృంభిస్తున్నా.. తగినన్నీ మందులు లేకపోవడంతో పేషెంట్స్‌కు సమస్యలు తప్పడం లేదు. రాష్ట్రంలోని గవర్నమెంట్ దవాఖానాల్లో మందుల కొరత విపరీతంగా పెరిగిపోయింది.. వైద్యులు ప్రిస్క్రిప్షన్‌లో పది రకాల మందులు రాస్తే, కేవలం రెండు మూడు రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. గుండె సంబంధిత, షుగర్, శ్వాస సంబంధిత, న్యూరాలజీ, నెఫ్రాలజీ… ఇలా ఖరీదైన మందులేవి అందుబాటులో లేవు. ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత ఉండటంతో బయట కొనుగోలు చేసుకోమని వైద్యులు చెబుతున్నారు.
Read Also: Sri lanka: శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం
బిపి, షుగర్, నొప్పుల మందులు, ఇతర ఐరన్, కాల్షియం, వంటి రోజువారీ మందులు కూడా లభించడం లేదు. గతంలో కనీసం 10, 15 రోజులకి సరిపడా మందులను ఇచ్చేవారు.. ఇప్పుడు ఐదు రోజుల ముందులను కూడా ఇవ్వడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పేషంట్స్ బయట మెడికల్ షాప్స్‌లో మందులు కొనుగోలు చేయలేక విపరీతమైన ఆర్థిక భారం అవుతోంది. డాక్టర్ మందుల చీటీ పై బ్రాండెడ్ ఔషధాలను రాయకూడదని… కేవలం జనరిక్ మందులను మాత్రమే రాయాలన్నా ఆదేశాలను వైద్యులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.