Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Job Guarantee Initiation For Telangana Degree And Engineering Students

Job Gurantee: డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు జాబ్ గ్యారంటీ కోర్సులు.. వినూత్న ప్రయోగానికి రేపు శ్రీకారం

NTV Telugu Twitter
Published Date :September 24, 2024 , 4:53 pm
By Rajesh Veeramalla
  • 38 కాలేజీల్లో జాబ్ గ్యారంటీ కోర్సు
  • కాలేజీల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం
  • డిగ్రీతో పాటు సరికొత్తగా నైపుణ్య డిగ్రీ
  • దేశంలోనే వినూత్న ప్రయోగానికి రేపు శ్రీకారం.
Job Gurantee: డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు జాబ్ గ్యారంటీ కోర్సులు.. వినూత్న ప్రయోగానికి రేపు శ్రీకారం
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాష్ట్రంలో ఈ ఏడాది డిగ్రీ, ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సురెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా బీఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణను అందించే వినూత్న కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించనున్నారు. ఉన్నత విద్యామండలి గుర్తించిన 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న 10 వేల మంది విద్యార్థులకు ఈ శిక్షణను అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మేలు జరిగేలా ఈ కాలేజీలను ఎంపిక చేసింది.

Modi-Zelensky: మూడోసారి జెలెన్స్కీతో మోడీ భేటి.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందా?

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జాబ్ డిమాండ్ ఉన్న బీఎఫ్ఎస్ఐ సంస్థలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతోంది. అత్యంత ఖరీదైన ఈ కోర్సును డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా అందించనుండటం విశేషం. ఈ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణను అందుకుంటున్న 10 వేల మంది విద్యార్థుల వివరాలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ రూపొందిస్తోంది. విద్యార్థుల బయోడేటాతో పాటు చదువుతున్న కాలేజీ, వారి విద్యార్హతలు, సాంకేతిక కోర్సుల అనుభవం వివరాలన్నీ అక్కడ పొందుపరుస్తారు. బీఎఫ్ఎస్ఐ రంగంలో పేరొందిన కంపెనీలు తమకు అవసరమైన ఉద్యోగులను ఎంపిక చేసుకునేందుకు ఈ పోర్టల్ వారధిగా పని చేస్తుంది. బీఎఫ్ఎస్ఐ కంపెనీలు ఈ పోర్టల్లో ఉన్న విద్యార్థులతో నేరుగా వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేసే వీలుంటుంది. దీంతో డిగ్రీ, ఇంజనీరింగ్ లో చేరిన విద్యార్థులకు చదువుతో పాటు ఉద్యోగ భరోసాకు ప్రభుత్వం కొత్త బాటలు వేసింది.

Delhi: కొత్త ఫోన్ కొన్నందుకు ట్రీట్ ఇవ్వలేదని స్నేహితుడు హత్య

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సహకారంతో బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం మినీ డిగ్రీ కోర్సుకు అవసరమైన సిలబస్ రూపొందించింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకుండా సీఎస్ఆర్ నిధులను సమీకరించి మూడేండ్ల పాటు ఈ శిక్షణను అందించేలా మంత్రి శ్రీధర్​ బాబు బీఎఫ్ఎస్ఐ సంస్థల ప్రతినిధులతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. EQUIPPP అనే సంస్థ ఈ ప్రోగ్రాంకు రూ.2.50 కోట్లు అందించేందుకు ముందుకు వచ్చింది. విద్యార్థులకు ఉపాధి కల్పించేలా జీసీసీలకు, ప్రభుత్వానికి అనుసంధాన కర్తగా ఉండటంతో పాటు సీఎస్ఆర్ నిధులను సమీకరించనుంది.

ఈ కోర్సుకు ఎంపిక చేసిన కాలేజీలు
(నాన్ ఇంజనీరింగ్ 20 కాలేజీలు)
* పింగళి ప్రభుత్వ మహిళా కాలేజీ, వడ్డేపల్లి, హన్మకొండ
* ఎస్.ఆర్ & బి.జి.ఎన్.ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, ఖమ్మం
* నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నల్గొండ
* ఆంధ్రా మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, హైదరాబాద్
* భవన్ డిగ్రీ మరియు పి.జి కాలేజీ, హైదరాబాద్
* ప్రభుత్వ సిటీ కాలేజీ, హైదరాబాద్
* ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సిద్దిపేట
* ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, బేగంపేట
* ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఖైరతాబాద్
* ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీ, నాంపల్లి
* నిజాం కాలేజీ, హైదరాబాద్
* ఆర్.బి.వి.ఆర్.ఆర్ డిగ్రీ కాలేజీ, హైదరాబాద్
* సెయింట్ అన్స్ మహిళా డిగ్రీ కాలేజీ, మెహిదీపట్నం
* సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా డిగ్రీ కాలేజీ, హైదరాబాద్
* సెయింట్ పియస్ ఎక్స్ మహిళా డిగ్రీ కాలేజీ, నాచారం
* తారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సంగారెడ్డి
* ఎం.వి.ఎస్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, మహబూబ్‌నగర్
* ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కరీంనగర్
* తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, కోఠి
* గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ, నిజామాబాద్

ఇంజనీరింగ్ కాలేజీలు (18):
1. బివిఆర్‌ఐటి హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీ (జెఎన్‌టియు హెచ్)
2. జి.నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (జెఎన్‌టియు హెచ్)
3. గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ & టెక్నాలజీ కాలేజీ (జెఎన్‌టియు హెచ్)
4. జె.బి ఇంజనీరింగ్ & టెక్నాలజీ కాలేజీ (జెఎన్‌టియు హెచ్)
5. జెఎన్‌టియు, కూకట్‌పల్లి ప్రధాన క్యాంపస్ (జెఎన్‌టియు హెచ్)
6. కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జెఎన్‌టియు హెచ్)
7. మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జెఎన్‌టియు హెచ్)
8. వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ (జెఎన్‌టియు హెచ్)
9. వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (జెఎన్‌టియు హెచ్)
10. కిట్స్, వరంగల్ (కేయూ)
11. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఓయూ)
12. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీ (ఓయూ)
13. మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజీ (ఓయూ)
14. మెథడిస్ట్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ కాలేజీ (ఓయూ)
15. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ (ఓయూ)
16. స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ & టెక్నాలజీ కాలేజీ (ఓయూ)
17. ఆర్జీయుకేటీ, బాసర (ఆర్జీయుకేటీ)
18. బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నర్సాపూర్ (జెఎన్‌టియు హెచ్)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • degree
  • engineering
  • initiation
  • job guarantee
  • Students

తాజావార్తలు

  • Uppu Kappurambu : 28 రోజుల్లోనే షూట్ కంప్లీట్.. కీర్తి సురేష్, సుహాస్ కామెంట్స్

  • CM Chandrababu: మంత్రి నారా లోకేష్‌ని కొనియాడిన సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..?

  • Maharashtra: హిందీ ‘విధింపు’పై వ్యతిరేకత.. కీలక నిర్ణయం తీసుకున్న మహరాష్ట్ర సర్కార్..

  • Indigo Flight: హైదరాబాద్ ఇండిగో విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం..

  • Air India flight: టోక్యో-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో సమస్య.. కోల్‌కతాలో ల్యాండింగ్..

ట్రెండింగ్‌

  • Viral Video: ఇది కాకి కాదు మేధావి.. ఈ వీడియో చూశాక దీని తెలివితేటలకు సలాం కొట్టాల్సిందే..!

  • Best Smartphones: రూ.15,000లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్లు ఇవే..!

  • BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!

  • Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!

  • Credit Card: క్రెడిట్ కార్డున్న వ్యక్తి మరణిస్తే.. బకాయి ఎవరు చెల్లించాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions