ఏడాదిలో ఏదో ఒక్క నెల ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయండని వైద్యులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో ఉండే వైద్యులు కూడా అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తున్నారని, వారు నిమ్స్ లాంటి ఆసుపత్రుల్లో సేవ చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రైవేట్‌కు ధీటుగా ఆసుపత్రులను సిద్ధం చేస్తాం అని, త్వరలో 25 ఆస్పత్రులు అందుబాటులోకి వస్తాయని సీఎం తెలిపారు. బంజారాహిల్స్‌లో ఏఐజీ ఆస్పత్రిని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు రెండో అతిపెద్ద ఆస్పత్రిని అందుబాటులోకి…
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. వీసాలను రద్దు చేసింది.
Damodara Raja Narasimha : ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రైవేట్ హాస్పిటల్స్‌లో సిజేరియన్ డెలివరీలు అత్యధికంగా చేస్తున్నట్లు గుర్తించి, ఈ విధానంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన సి-సెక్షన్ ఆడిట్‌ను మరింత కఠినంగా నిర్వహించాలని సూచించారు. గురువారం, కోఠీలోని టీజీఎంఎస్ఐడీసీ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, మంత్రి ప్రభుత్వ హాస్పిటల్స్‌లో నార్మల్ డెలివరీల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. నార్మల్ డెలివరీలు చేసే లాభాలను,…
ఏపీలో 5 ప్రభుత్వ వైద్యశాలలకు క్రిటికల్ కేర్ బ్లాక్ లు మంజూరయ్యాయి. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో భాగంగా రాష్ట్రానికి 5 క్రిటికల్ కేర్ బ్లాక్ లు మంజూరయ్యాయి. దీనిలో భాగంగా 50 బెడ్స్ అత్యాధునిక క్రిటికల్ కేర్ ఐసియు విభాగాలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒక్కో యూనిట్ కు రూ. 23 కోట్ల 75 లక్షల చొప్పున మొత్తం రూ. 118 కోట్ల 75 లక్షలు మంజూరు చేస్తూ…
Damodara Rajanarasimha : ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన పౌరులతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా ఉంది. అనారోగ్యం వల్ల ప్రజలు అప్పులపాలు కాకుండా, అవసరమైన అన్ని వైద్య సేవలు వారికి సమయానికి అందాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. వైద్యం ఉచితంగా లభిస్తుందన్న భరోసా ప్రజలకు కలగాలి. ఆ భరోసాను కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద…
మేడ్చల్ జిల్లా, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కు తాళం వేసే దుస్థితి వస్తే ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ ఏం చేస్తున్నట్లు? అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. హైదరాబాద్ సహా నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో బస్తీ దవాఖానాల పనితీరు దుర్భరంగా ఉందని.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు అని ప్రశ్నించారు. తాజాగా ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
డ్రగ్ కంట్రోల్ అథారిటీ, TGMSIDC అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడుతూ.. నాసిరకం నకిలీ మందులు తయారీ చేసేవారిపై అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులకు సుస్తి చేసింది. సీజనల్ వ్యాధులకు తోడు విష జ్వరాలు విజృంభిస్తున్నా.. తగినన్నీ మందులు లేకపోవడంతో పేషెంట్స్‌కు సమస్యలు తప్పడం లేదు. రాష్ట్రంలోని గవర్నమెంట్ దవాఖానాల్లో మందుల కొరత విపరీతంగా పెరిగిపోయింది.. వైద్యులు ప్రిస్క్రిప్షన్‌లో పది రకాల మందులు రాస్తే, కేవలం రెండు మూడు రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సచివాలయంలో ప్రభుత్వ ఆసుపత్రులలో, మెడికల్ కాలేజ్‌లలో సెక్యూరిటీ బలోపేతంపై సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2008 సంవత్సరంలో రూపొందించిన యాక్ట్ 11పై చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో భద్రతను కట్టుదిట్టం చేసి ఆస్పత్రి సిబ్బందికి ముఖ్యంగా మహిళా డాక్టర్లు, మహిళ నర్సింగ్ ఆఫీసర్లు , సిబ్బందికి రక్షణగా షీ టీంలతో రాత్రి సమయాలలో పెట్రోలింగ్ చేసేలా నిబంధనలు…
Satyakumar: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆడిటింగ్ నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శానిటేషన్, ఆస్పత్రుల నిర్వహణ, ఎక్విప్మెంట్, డయాలసిస్ కేంద్రాలు లాంటి వాటిపై ఆడిటింగ్ చేపడతామన్నారు.