తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులకు సుస్తి చేసింది. సీజనల్ వ్యాధులకు తోడు విష జ్వరాలు విజృంభిస్తున్నా.. తగినన్నీ మందులు లేకపోవడంతో పేషెంట్స్‌కు సమస్యలు తప్పడం లేదు. రాష్ట్రంలోని గవర్నమెంట్ దవాఖానాల్లో మందుల కొరత విపరీతంగా పెరిగిపోయింది.. వైద్యులు ప్రిస్క్రిప్షన్‌లో పది రకాల మందులు రాస్తే, కేవలం రెండు మూడు రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.
జీతం ఎక్కువస్తుందనకుంటే ఎన్నో కంపెనీలు మారుతాం. ఎందుకంటే పైసల కోసమే కదా బ్రతికేది. కొందరు ఎక్కువగా డబ్బులు వస్తాయని విదేశాలకు కూడా వెళ్లి సంపాదిస్తారు. ఐతే ఇక్కడ ఏడాదికి జీతం కోటికి పైగా ఇస్తారంట. ఇంతకీ ఎక్కడనుకుంటున్నారా.. ఇండియాలో అయితే కాదు, స్కాట్లాండ్ లో.. స్కాట్లాండ్ పరిధిలోని కొన్ని చిన్న దీవుల్లో వైద్యుల కొరత, టీచర్ల కొరత ఉంది. అందుకోసమని అక్కడి ప్రభుత్వం.. ఓ ప్రకటన చేసింది. ఇక్కడ పనిచేసేందుకు ఉత్సాహవంతులైన వారు కావాలని.. డాక్టర్లకు ఏడాదికి…
అప్పుడే పుట్టిన చిన్నారులకు తల్లిపాలు చాలా అవసరం. ఎందుకంటే తల్లిపాలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అందుకే పుట్టిన పిల్లలకు తల్లిపాలు ఇవ్వడానికే అందరూ ప్రాధాన్యం ఇస్తారు. అయితే కొందరు తల్లులుకు పాలు రాకపోతే పిల్లలకు సమస్య ఏర్పడుతుంది. భారత్‌లోని మహిళలకు తల్లి పాలు రాకపోవడం అన్న సమస్య అరుదుగానే ఉంటుంది. కానీ అమెరికాలో మాత్రం తల్లులకు సరిగ్గా పాలు రావు. అక్కడి మహిళలు ఆధునిక జీవనశైలిని కలిగి ఉండటం వల్ల తల్లుల్లో పాల కొరత ఏర్పడుతోంది.…
ఆక్సిజన్ సంక్షోభం అంచున తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ఉంది. ఆసుపత్రికి పంపే ఆక్సిజన్ లో కోత విధించాల్సిందిగా సరఫరాదారును ఆదేశించింది తమిళనాడు ప్రభుత్వం. 15 ఏళ్లుగా తమిళనాడులోని ఎయిర్ వాటర్ కంపెనీ నుంచి స్విమ్స్ కి ఆక్సిజన్ వస్తుండగా.. రెండు విడతలుగా రోజుకు 14 కేఎల్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా అవుతోంది. ప్రస్తుతం 8కేఎల్ కి మించి ఆక్సిజన్ పంపించలేమని స్విమ్స్ కి తేల్చి చెప్పారు గుత్తేదారు. ప్రస్తుతం స్విమ్స్ లో 467మంది కోవిడ్ రోగులు…