అక్రమ సంబంధాలు… మానవ సంబంధాలను మాటగలుపుతున్నాయి. ప్రియుడు, ప్రియురాలు వ్యామోహంలో పడి.. కట్టుకున్నవారినే కాదు… కన్న తల్లి, తండ్రిని సైతం అంతం చేస్తున్నారు. చివరకు అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలను కూడా కర్కశంగా చంపేస్తున్నారు.. చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగిన సోదరుని సైతం కిరాతకంగా ప్రియుడితో కలిసి చంపేసింది.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న ప్రియురాలి తల్లిని ప్రియుడు అతి కిరాతకంగా చంపేసి బంగారు ఆభరణాలు ఎత్తుకొని పారిపోయాడు.. తల్లిని చంపిన విషయం అక్కకు తెలియడంతో చెల్లిని నిలదీసింది.. చెల్లిని బెదిరించింది పోలీస్ కేసు పెట్టి జైలు పాలు చేస్తానని చెప్పింది.. దీంతో ప్రియుడితో కలిసి అక్కను చంపేసి నీళ్ల సంపులో పూడ్చిపెట్టింది.. మూడు రోజుల తర్వాత హత్య వెలుగులోకి రావడంతో పోలీసులు చెల్లి లక్ష్మి అదుపులో తీసుకొని విచారిస్తే అన్ని విషయాలు బట్టబయలయ్యాయి. దీనికి తోడు అప్పటికే తన ప్రియుడు అయిన అరవింద్‌ని అప్పటికే రాష్ట్రం దాటి పంపేసింది. జవహార్ నగర్లో జరిగిన ఈ జంట హత్యలు సంచలనం రేపుతున్నాయి.
జవహార్ నగర్లో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా… చనిపోయిన మహిళ స్థానికంగా ఉండే 65 ఏళ్ల సుశీలగా గుర్తించారు పోలీసులు. తన ముగ్గురు కూతుళ్లతో కలిసి జవహార్‌నగర్ పరిధిలోని భరత్‌నగర్‌లో నివాసం ఉంటోంది. తండ్రి చనిపోవడంతో ఒక కూతురికి రైల్వే ఉద్యోగం వచ్చింది. మరొక కూతురు కాల్ సెంటర్లో పనిచేస్తుంది.. ఇంకొక కూతురు అమెరికాలో సెటిల్ అయింది.. మరొక కూతురు ఇంటి దగ్గరే ఉండి తల్లికి చేదోడువాదులుగా ఉంటుంది.. ఒక కూతురు లాలాగూడలో రైల్వే క్వార్టర్స్ లో నివాసం ఉంటుంటే తల్లి లక్ష్మీ కలిసి జవహార్ నగర్లో నివాసం ఉంటుంది. వీళ్ళ ఇంటిలో ఆరు నెలల క్రితం బీహార్‌కు చెందిన అరవింద్ అద్దెకు దిగాడు.. ప్రైవేట్ కంపెనీలో అరవింద పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మూడవ కూతురు అయిన లక్షీతో అరవింద్‌కు స్నేహం ఏర్పడింది.. ఈ స్నేహం కాస్త వివాహేతర సంబంధానికి దారి చేసింది.. ఈ వివాహేతర సంబంధాన్ని తల్లి సుశీల ఎప్పటికప్పుడు వారిస్తూ కూతురు లక్ష్మిని బెదిరించింది. అరవింద్ తో వివాహేతర సంబంధం పెట్టుకోవద్దని లక్షీని బెదిరించింది..
ఈ సంబంధానికి పుల్ స్టాప్ పెట్టాలని లక్షీకి తల్లి సుశీల చెప్పింది.. ఈ విషయం ప్రియుడు అయిన అరవింద్‌కి లక్ష్మీ చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది.. దీంతో తమ సంబంధానికి లక్ష్మీ తల్లి సుశీల అడ్డుగా ఉందని అరవిందు భావించాడు.. ఈ నేపథ్యంలోనే సుశీలను చంపేస్తే తమ సంబంధానికి అడ్డు ఉండదని అనుకున్నాడు.. ఇందులో భాగంగానే సుశీలని చంపాలని ప్లాన్ చేసుకున్నాడు.. దీనిలో భాగంగానే ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో సుశీలను చంపివేసి ఆమె వద్ద ఉన్న బంగార ఆభరణాలు తీసుకొని అరవింద్ పారిపోయాడు. సుశీల హత్య విషయాన్ని కూతుళ్లకు తెలియజేశారు పోలీసులు. అంతలోపే మరో ట్విస్ట్ ఎదురైంది. సుశీల పెద్ద కూతురు జ్ఞానేశ్వరి నాలుగు రోజులుగా కనిపించడం లేదన్న విషయాన్ని పోలీసులకు తెలిపారు సుశీల ఇద్దరు కూతుళ్లు లక్షీ, ఉమ. మరో వైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని సుశీల మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. జ్ఞానేశ్వరిపై మిస్సింగ్ నమోదు చేసి గాలింపు చేపట్టారు పోలీసులు.
ఉప్పల్ పరిధిలోని.. లాలాగూడ సమీపంలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. ఓ నీటి సంపు నుంచి దుర్వాసన వస్తోందని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. సంపులో వెతికి చూడగా కుళ్లిపోయిన స్థితిలో ఓ యువతి మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు పోలీసులు. అక్కడ లభించిన ఆధారాలతో మృతురాలు జ్ఞానేశ్వరి గా గుర్తించారు. ఇక్కడే మరో ట్విస్ట్ ఎదురైంది. లాలాగూడలో మృతిచెందిన జ్ఞానేశ్వరి.. జవహార్‌నగర్‌లో హత్యచేయబడ్డ సుశీల ఇద్దరూ తల్లీకూతుళ్లు. దీంతో… విషయాన్ని జవహార్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు లాలాగూడ పోలీసులు. అప్పటికే జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. విషయం తెలుసుకుని లాలాగూడ వెళ్లారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో.. హత్య చేయబడి నాలుగు రోజులు అయి ఉంటుందని అనుమానించారు పోలీసులు.
సుశీల, జ్ఞానేశ్వరి ఇద్దరినీ హత్య చేసింది ఒక్కరే అని పోలీసులు అనుమానించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అయితే ఇందులో మరొక టెస్ట్ కూడా వెలుగులోకి వచ్చింది. జ్ఞానేశ్వరీని ఒక అరవింద్ మాత్రమే చంపలేదని తేలింది. జ్ఞానేశ్వరి చెల్లి, అరవింద్ కలిసి ఆమెను చంపివేసి సంపులో పడేశారని తేలింది. ఉత్తరప్రదేశ్‌కి చెందిన అరవింద్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న అరవింద్.. కొన్నాళ్లుగా జవహార్ నగర్లో ఉంటున్నాడు. సుశీల, జ్ఞానేశ్వరిలను హత్య చేయడానికి అక్రమ సంబంధమే కారణంగా పోలీసులు చెప్పారు.. సుశీల రెండో కూతురు లక్షీతో అరవింద్‌కు అక్రమ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లను గమనించిన లక్షీ చెల్లి అక్క జ్ఞానేశ్వరితోపాటు.. అరవింద్‌ను నిలదీసింది. పలుమార్లు అడ్డుకునే ప్రయత్నం చేసింది. తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తోందని.. అరవింద్ పక్కా ప్లాన్‌తో జ్ఞానేశ్వరిని హత్య చేశాడు. లాలాగూడకు తీసుకెళ్లి.. నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న సంపులో పాడేశాడు. జ్ఞానేశ్వరి అడ్డు తొలగించుకున్నా.. లక్ష్మి తల్లి సుశీల కూడా అడ్డుగా ఉందని భావించాడు అరవింద్. తల్లిని కూడా అంతమొందిస్తే.. లక్ష్మీకి తనకు ఇక ఎలాంటి అడ్డు ఉండదని ప్లాన్ చేశాడు. ఇంట్లో సుశీల ఒంటరిగా ఉన్న సమయంలో అరవింద్.. కర్రతో దాడిచేసి చంపాడు.. ఈ జంట హత్య కేసులో నాలుగు రోజులు పాటు సస్పెన్స్ కొనసాగింది చివరికి తల్లి కూతుళ్ల మృతదేహాలకు పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోవైపు ఈ కేసులో కీలక నిందితురాలైన లక్ష్మీని అరెస్టు చేసి రిమాండ్ పంపారు.