ఛావా సినిమా రిలీజ్ తరువాత నిధి అన్వేషణ గురించి చర్చలు హాట్ టాపిక్ అవుతున్నాయి. నిజానికి, అసిర్‌గఢ్ కోట దగ్గర, గ్రామస్తులు రాత్రి చీకటిలో నిధి కోసం వెతకడం ప్రారంభించారు. దీనికి కారణం విక్కీ కౌశల్ కొత్త చిత్రం ‘ ఛావా’. అసిర్‌గఢ్ కోట సమీపంలో మొఘలుల దాచిన నిధి గురించి మరోసారి పుకార్లు కలకలం సృష్టించాయి. గత మూడు రోజులుగా, వందలాది మంది గ్రామస్తులు రాత్రి చీకటిలో మొబైల్ టార్చ్ లైట్ వెలుగులో పొలాల్లో తవ్వుతున్నారు. వారు తమకు మొఘల్ బంగారు నాణేలు వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. ఈ పుకారు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో, నిధి కోసం అన్వేషణ మరింత మంది అక్కడికి క్యూ కట్టారు. తవ్వకాలలో మొఘల్ కాలం నాటి పురాతన నాణేలు దొరికాయని కొంతమంది స్థానిక ప్రజలు చెబుతున్నారు.
Perni Nani: బాబువి డైవర్షన్ పాలిటిక్స్.. అందుకే ఇదంతా..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ప్రజలు పొలాల్లో గుంతలు తవ్వి నాణేల కోసం వెతుకుతున్నట్లు కనిపిస్తోంది. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. నాలుగు నెలల క్రితం కూడా ఇలాంటి పుకారు కారణంగా, పెద్ద సంఖ్యలో ప్రజలు తమ పొలాలను తవ్వడం ప్రారంభించారు. నిధి కోసం అన్వేషణ వార్త అందిన వెంటనే నింబోలా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పొలాల్లో గుంతలు కనిపించాయి కానీ ఇప్పటివరకు ఎలాంటి నాణేలు లేదా నిధికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు కనుగొనబడలేదు. బుర్హాన్‌పూర్ ఎస్పీ దేవేంద్ర పాటిదార్ మాట్లాడుతూ, “మేము మొత్తం విషయాన్ని దర్యాప్తు చేస్తున్నాము, ఎవరైనా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారు.
#Chhaava#VickyKaushal నటించిన 'ఛావా' సినిమాలో దాచిన నిధి గురించి పుకార్ల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని #Burhanpur అసిర్‌గఢ్ కోట చుట్టూ గుమిగూడి అర్ధరాత్రి తవ్వడం మొదలు పెట్టిన వందలాది మంది ప్రజలు@vickykaushal09 @iamRashmika pic.twitter.com/JKdguJ4yu0
— The Cult Cinema (@cultcinemafeed) March 8, 2025