Vivo T4x 5G: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు భారత మార్కెట్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే భారత్ లో బడ్జెట్ రేంజ్ ఫోన్లకు ఉన్న భారీ డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరిగ్గా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వివిధ సంస్థలు కొత్త ఫీచర్‌లతో ఫోన్లను విడుదల చేస్తూ.. మొబైల్ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 2025లో ఇప్పటివరకు శాంసంగ్ ఎంట్రీ, బడ్జెట్ సెగ్మెంట్‌లో ఏకంగా 4 కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. తాజాగా, వివో కూడా తన మిడ్ రేంజ్ ఫోన్ వివో V50 ని మార్కెట్లోకి తీసుకురావడంతో పాటు.. తాజాగా వివో T4x 5G పేరుతో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మరి ఈ వివో T4x 5G ఫోన్ ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దామా..
Read Also: Stock Market: మార్కెట్‌కు సరికొత్త జోష్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ అనేక అద్భుతమైన ఫీచర్‌లతో మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ 6.72 అంగుళాల భారీ FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1050 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది మొత్తం మూడు వేరియంట్స్ లో విడుదలయ్యింది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.
ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఇక ఫోన్ లో కెమెరా పరంగా చూస్తే.. ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉండగా.. ప్రధానంగా 50MP కెమెరాతో పాటు, 2MP బొకేష్ లెన్స్ ను అందించింది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరా అందించారు. ఈ కెమెరా యూనిట్ AI ఫీచర్‌లను సపోర్ట్ చేస్తుంది. వెనుక వైపు డైనమిక్ లైట్ రింగ్‌ను కూడా కలిగి ఉండడం విశేషమే. ఈ ఫోన్‌స్ మెరైన్ పర్పుల్, ప్రాంటో పర్పుల్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
Read Also: ICC ODI Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన టీమిండియా ఆటగాళ్లు
వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ లో మరో చెప్పుకోతగ్గ విషయమేమిటంటే.. ఇది 6500mAh భారీ బ్యాటరీతో వచ్చింది. అలాగే ఇది 44W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే మెరుగైన ఆడియో అనుభవం కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు, గేమింగ్ కోసం 4D గేమ్ వైబ్రేషన్ ఫీచర్‌ను అందించింది. వివో T4x 5G ఫోన్ 6GB -128GB వేరియంట్ ధర రూ.13,999, 8GB -128GB వేరియంట్ ధర రూ.14,999, 8GB -256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ మార్చి 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్ ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను వివో వెబ్ సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. HDFC, SBI, Axis బ్యాంకుల కార్డులతో రూ.1000 డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు.