నేటి రోజుల్లో ప్రజలంతా ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రకరకాల వ్యాయామాలు చేస్తు్న్నారు. ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. పోషకాహారానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి మీరు కూడా ఆరోగ్యం కోసం ఏం ఫుడ్ తినాలని ఆలోచిస్తున్నారా? అయితే ఉదయం వేళ ఖాళీ కడుపుతో ఈ గింజలను తింటే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. గింజల్లో ప్రోటీన్, నికోటిన్ ఆమ్లం, థయామిన్, కార్బోహైడ్రేట్, ఫైబర్, ఖనిజాలు, ఇనుము, పొటాషియం అనేక ఇతర పోషకాలు ఉన్నాయి.
Also Read:Indian Railways: ఇకపై కన్ఫామైన టికెట్ ఉంటేనే ప్లాట్‌ఫామ్ పైకి అనుమతి.. రైల్వే కీలక నిర్ణయం.
నల్ల ఎండుద్రాక్ష
నల్ల ఎండుద్రాక్షలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఎల్-అర్జినిన్, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి గర్భాశయం, అండాశయాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
పిస్తాపప్పు
పిస్తాపప్పులలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి-6, థయామిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. దీన్ని తినడం వల్ల రాత్రి బాగా నిద్రపడుతుంది.
బాదం
బాదంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, కాల్షియం, రాగి, మెగ్నీషియం, రిబోఫ్లేవిన్, ఐరన్, పొటాషియం, జింక్, విటమిన్ బి పుష్కలంగా ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తపోటును నియంత్రిస్తాయి.
డేట్స్
సెలీనియం, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఖర్జూరంలో పుష్కలంగా లభిస్తాయి. దీన్ని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడంలో సాయపడుతుంది.
Also Read:Shakti App: “శక్తి”యాప్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. ఎలా పనిచేస్తుందంటే..?
వాల్నట్
వాల్నట్లో యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ వాల్‌నట్స్ తినడం వల్ల మీ కండరాలు బలపడతాయి. ఇది గుండె, మెదడుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రోటీన్ తో పాటు, ఇందులో ఫైబర్, రాగి, ఇనుము, పొటాషియం, కాల్షియం, విటమిన్ బి6, ఫోలేట్, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి.