Apple Launches iPad: భారత్‌లో సరికొత్త చిప్‌లతో ఐప్యాడ్‌లను విడుదల చేసిన యాపిల్
- సరికొత్త చిప్‌లతో ఐప్యాడ్‌లను భారత్‌లో విడుదల చేసిన యాపిల్
- శక్తివంతమైన A16 చిప్‌ను ఉపయోగించి 2025 మోడల్ ఐప్యాడ్‌ను విడుదల.
- M3 చిప్‌తో ఐప్యాడ్ ఎయిర్ 7వ తరం (జెనరేషన్) టాబ్లెట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple Launches iPad: యాపిల్ కంపెనీ తాజాగా 2025 మోడల్ ఐప్యాడ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఐప్యాడ్‌లో శక్తివంతమైన A16 చిప్‌ను ఉపయోగించారు. గత మోడల్స్‌తో పోలిస్తే, స్టోరేజ్‌ను కూడా పెంచారు. ఇంతకుముందు 64GB బేస్ మోడల్ ఉంటే, ఇప్పుడు 128GBతో ప్రారంభమవుతుంది. ఈ ఐప్యాడ్ 10.9 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఫోటోలను, వీడియోలను చాలా క్లారిటీగా, కలర్‌ఫుల్‌గా చూపిస్తుంది.
Read Also: Meenakshi Natarajan: పని చేస్తుంది ఎవరు.. యాక్టింగ్ చేస్తుంది ఎవరనేది తెలుసు
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
ఇక ఇందులో వదిన A16 చిప్ టాబ్లెట్ పనితీరును, పవర్ ఎఫిషియెన్సీని బాగా పెంచుతుంది. పాత మోడల్స్‌తో పోలిస్తే స్పీడ్ 30 శాతం, ఓవరాల్ పనితీరు 50 శాతం పెరిగినట్లు ఆపిల్ సంస్థ పేర్కొంది. మార్కెట్లో ఉన్న టాప్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ల కంటే ఇది ఆరు రెట్లు వేగవంతంగా ఉంటుంది. A16 చిప్‌లో 5-కోర్ CPU, 4-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజన్ ఉన్నాయి. ఇక ఈ ఐప్యాడ్‌లో కెమెరా, డిస్‌ప్లే ఫీచర్ల విషయానికి వస్తే.. వెనుక వైపు 12MP కెమెరా ఉంది. ముందు వైపు 12MP వైడ్ యాంగిల్ లెన్స్‌తో సెంటర్ స్టేజ్ ఫీచర్ సపోర్ట్ ఉంటుంది. వీడియో కాల్స్‌లో కదులుతున్నా, ఫోకస్‌లో ఉంచుతుంది. ఇక ధరల విషయానికి వస్తే.. 128GB రూ.34,900, 256GB రూ.44,900, 512GB రూ.64,900గా ఉన్నాయి. సెల్యులార్ మోడల్ 128GB ధర రూ.49,900. మార్చి 12వ తేదీ నుంచి యాపిల్ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు.
ఇక మరోవైపు, యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 7వ తరం (జెనరేషన్) టాబ్లెట్‌ను కూడా విడుదల చేసింది. ఇది M3 చిప్‌తో వస్తోంది. దీనిని రెండు సైజుల్లో (11 అంగుళాలు, 13 అంగుళాలు) విడుదల చేసారు. M3 చిప్‌లో 8-కోర్ CPU, 9-కోర్ GPU ఉండడంతో అవి.. CPU పనితీరును 35%, గ్రాఫిక్స్ 40% మెరుగుపరుస్తుందని ఆపిల్ పేర్కొంది. ఈ టాబ్లెట్ యాపిల్ ఇంటెలిజెన్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ వల్ల క్రియేటివిటీ, ప్రొడక్టివిటీ పనుల్లో మంచి ఫలితాలను ఇస్తుంది. మ్యాజిక్ కీబోర్డ్, యాపిల్ పెన్సిల్ (USB-C, ప్రో) వంటి యాక్సెసరీస్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.
Read Also: Dharmapuri Arvind: ట్రంప్ మోడీని కుర్చీలో దగ్గరుండి కూర్చోపెడుతున్నారు.. రేవంత్ ఓ లెక్కా!
ఇక దీని ధర విషయానికి వస్తే.. 11 అంగుళాల వై-ఫై మోడల్ (128GB) ధర రూ.59,900 కాగా.. 11 అంగుళాల వై-ఫై + సెల్యులార్ (128GB) మోడల్ ధర రూ.74,900. అలాగే13 అంగుళాల వై-ఫై మోడల్ రూ.79,900. ఇంకా 13 అంగుళాల సెల్యులార్ మోడల్ రూ.94,900 గా ఆపిల్ నిర్ణయించింది. మార్చి 12 నుంచి యాపిల్ అధికారిక వెబ్‌సైట్, స్టోర్లలో లభిస్తుంది. మొత్తం మీద కొత్త ఐప్యాడ్, ఐప్యాడ్ ఎయిర్ రెండు టాబ్లెట్లు శక్తివంతమైన చిప్‌సెట్లు, మెరుగైన డిస్‌ప్లే, మంచి బ్యాటరీ లైఫ్‌తో వచ్చాయి. ప్రొఫెషనల్స్, గేమర్స్, సాధారణ వినియోగదారులకు ఇవి మంచి ఛాయిస్ అవుతాయి.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!