GlocalMe PetPhone: ప్రస్తుతం జరుగుతున్న ప్రతిష్టాత్మక మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2025లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక టెక్నాలజీలు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. వివిధ టెక్ కంపెనీలు తమ వినూత్న ఉత్పత్తులను ఒకే వేదికపై ఆవిష్కరిస్తున్నాయి. వాటిలో పెంపుడు జంతువులను ప్రేమించే వారికి గ్లోకల్‌మీ కంపెనీ అందించిన సరికొత్త డివైజ్ “పెట్‌ఫోన్” (PetPhone) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక ఈ పెట్‌ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. దీని ద్వారా మీ పెంపుడు జంతువులు ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా వాటితో టచ్‌లో ఉండవచ్చు. ఇది టూ-వే (Two Way) కమ్యూనికేషన్ ఫీచర్‌తో వస్తుంది. అలాగే, మీ పెంపుడు జంతువు ఏం చేస్తుందో కూడా గుర్తిస్తుంది. రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, జీపీఎస్, వై-ఫై, బ్లూటూత్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో మీరు మీ జంతువును ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు.
Read Also: Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు మరో నోటీసు..
ఇక పెట్‌ఫోన్ లో ఉన్న ప్రత్యేకమైన AI టెక్నాలజీ, పెంపుడు జంతువుల మూడ్‌ను అంచనా వేయడంలో సహాయపడుతుంది. అది ఎలా అంటే.. జంతువులు చేసే వివిధ రకరకాల శబ్దాలను గుర్తించి, డివైజ్ కు కనెక్ట్ చేయబడ్డ యజమానులకు అలర్ట్ ఇస్తుంది. “పా టాక్” (Paw Talk) అనే ఫీచర్ ద్వారా మీరు మీ పెంపుడు జంతువులతో నేరుగా కూడా మాట్లాడవచ్చు. ‘సౌండ్ ప్లే ఆప్షన్స్’తో పెంపుడు జంతువులను ఓదార్చడం కూడా వీలయ్యేలా టెక్నాలజీని రూపొందించారు.
Read Also: Tollywood: ఒకేరోజు 13 సినిమాలు.. ఏమేంటో తెలుసా?
ఈ పెట్‌ఫోన్‌లో జీపీఎస్, ఏజీపీఎస్, ఎల్‌బీఎస్, వై-ఫై, బ్లూటూత్, యాక్టివ్ రాడార్ వంటి ఆధునిక ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఒకవేళ జంతువు ఉన్న సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది కచ్చితమైన లొకేషన్‌ను అందిస్తుంది. “పా ట్రాక్” టెక్నాలజీ ద్వారా మీ జంతువు ఎటువైపు వెళ్తుందో కూడా మీరు సులభంగా తెలుసుకోవచ్చు. ఈ పెట్‌ఫోన్ ప్రపంచంలో ఎక్కడైనా 200 కంటే ఎక్కువ దేశాల్లో పనిచేయగలిగేలా డిజైన్ చేయబడింది. ఇది క్లౌడ్ సిమ్ టెక్నాలజీ ద్వారా పని చేస్తుంది కాబట్టి, లోకల్ సిమ్ కార్డ్ అవసరం లేదు. ఇది IP68 రేటింగ్ కలిగి ఉండటం వల్ల దుమ్ము, నీరు ఇందులోకి ప్రవేశించవు.