Jio Recharge: జియో (Jio) తన ప్రీపెయిడ్ ఆఫర్లను మరింత విస్తరిస్తోంది. భారీ డేటా వినియోగదారులు, వినోద ప్రియులు, తక్కువ బడ్జెట్‌లో ఉన్నవారికి అనుగుణంగా కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 5G ప్రయోజనాలతో రూ. 500లోపు ప్లాన్ కోసం చూస్తున్నవారికి జియో మూడు ఆప్షన్లను అందిస్తోంది. అవి రూ. 198, రూ. 349, రూ. 445 ప్లాన్లు. మీ అవసరానికి సరిపోయే ప్లాన్ ఎంచుకోవడంలో సహాయపడేందుకు ఈ మూడు ప్లాన్ల వివరాలు ఒకసారి చూసేద్దామా..
రూ. 198 ప్రీపెయిడ్ ప్లాన్:
రూ. 198 ప్లాన్ చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ లో రోజుకు 2GB డేటా (లిమిట్ ముగిసిన తర్వాత వేగం 64 kbpsకు తగ్గుతుంది), అర్హులైన వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5G డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (లొకల్, STD, రోమింగ్), రోజుకు 100 SMSలు, జియో టీవీ (Jio TV), జియో క్లౌడ్ (Jio Cloud) యాక్సెస్ లభిస్తాయి. మరి ఈ ప్లాన్‌లో ప్రధాన లోపం దాని కాలపరిమితి. ఈ ప్లాన్ కేవలం 14 రోజులపాటు మాత్రమే చెల్లుతుంది. స్వల్పకాలికంగా ఎక్కువ డేటా అవసరముంటే ఈ ప్లాన్ బాగుంటుంది. అయితే, ఎక్కువకాలం చెల్లుబాటులో ఉండే ప్లాన్ కావాలంటే, మిగిలిన రెండు ప్లాన్లు మీకు సరిపోతాయి.
రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్:
పూర్తి నెలపాటు చెల్లుబాటులో ఉండే ప్లాన్ కోసం చూస్తున్నవారికి రూ. 349 ప్లాన్ మంచి ఎంపిక. ఈ ప్లాన్‌లో రోజుకు 2GB డేటా (లిమిట్ ముగిసిన తర్వాత వేగం 64 kbpsకు తగ్గుతుంది), అన్‌లిమిటెడ్ 5G డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (లొకల్, STD, రోమింగ్), రోజుకు 100 SMSలు, జియో టీవీ, జియో క్లౌడ్ యాక్సెస్ లు లభిస్తాయి. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు అవుతుంది. అదనపు OTT సబ్‌స్క్రిప్షన్లు అవసరం లేకుండా నెలంతా సౌకర్యవంతంగా ప్లాన్ కావాలంటే ఇది సరైన ఎంపిక.
రూ. 445 ప్రీపెయిడ్ ప్లాన్:
డేటాతో పాటు OTT సబ్‌స్క్రిప్షన్లను కూడా కోరుకునే వినియోగదారులకు రూ. 445 ప్లాన్ ఉత్తమమైన ఎంపిక. ఈ ప్లాన్ లో రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ 5G, వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలతో పాటు 11 OTT ప్లాట్‌ఫాంలు (SonyLIV, Zee5, Lionsgate Play, Discovery Plus, Sun NXT, Chaupal, Flat Marathi etc..), జియో క్లౌడ్ సేవలు లభిస్తాయి. అయితే ఇన్ని సదుపాయాలు కేవలం 28 రోజులకె చెల్లుబాటని మరిచిపోవద్దు.
మొత్తంగా మీకు ఏ ప్లాన్ సరిపోతుందన్న విషయంపై తుది నిర్ణయం మీదే. బడ్జెట్ పరంగా చౌకగా కావాలంటే రూ. 198 ప్లాన్ సరైనది. అదే 28 రోజులపాటు ఉన్న సాధారణ ప్లాన్ కావాలంటే రూ. 349 ప్లాన్. ఇంకా డేటాతో పాటు OTT సర్వీసులు కూడా కావాలంటే రూ. 445 ప్లాన్ మీకు సరిపోతుంది.