తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో హస్తం హవా కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అశ్వరావుపేట, ఇల్లందు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా.. కాంగ్రెస్ గెలుపు ధీమాపై సీనియర్ నేత వీ.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
Chandrababu: ముందంజలో కాంగ్రెస్.. పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు కీలక సందేశం!
తాను ముందు నుండి చెప్తున్నా.. కాంగ్రెస్ విజయం సాధిస్తుందని వీహెచ్ అన్నారు. ఇది ప్రజల విజయం.. బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలు చూసి కాంగ్రెస్ కు ఓటేసారన్నారు. రాహుల్ గాంధీ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారని.. అది కూడా బాగా కలిసొచ్చిందని చెప్పారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని వీహెచ్ పేర్కొన్నారు. ఆయన పార్టీ కోసం కష్టపడ్డారని.. కామారెడ్డిలో కూడా గెలుస్తున్నాడని వీహెచ్ అన్నారు.
Bigg Boss7 Telugu : అమర్ కు నాగ్ బిగ్ సర్ ప్రైజ్.. గౌతమ్, శివాజీ లు డిష్యుం డిష్యుం..