బిగ్ బాస్ 7 తెలుగు ఎండింగ్ చేరుకుంది.. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతార అని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇక నిన్న శనివారం వీకెండ్ ఎపిసోడ్ నాగ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. అలానే నంబరింగ్ బోర్డు చూపిస్తూ ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నాడు.. శివాజీ, ప్రియాంక, అమర్ దీప్, గౌతమ్‌లకు క్లాస్ పీకాడు నాగ్. ప్రియాంక ఆడే డబుల్ గేమ్ లను, గౌతమ్.. అమర్, శోభాకి సపోర్ట్ చేయడంపై ప్రియాంకని నిలదీయకపోవడంపై ప్రశ్నించారు. అలాగే శివాజీ, శోభా శెట్టి సరైన ఆట ఆడలేదని ప్రశ్నించారు..
అలాగే అమర్ కు బిగ్ సర్ప్రైజ్ ను కూడా ఇచ్చాడు నాగ్.. అర్జున్ తర్వాత అత్యధిక పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉన్న అమర్ దీప్ కోరికని నెరవేర్చాడు. అత్యధిక పాయింట్లు సాధించినందుకుగానూ మంచి ఆటతీరుకి వచ్చే వారం కెప్టెన్‌గా అపాయింట్ చేశాడు. దీంతో అమర్ ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. అయితే ఇంతకు ముందులా కెప్టెన్‌కి వచ్చే ఇమ్యూనిటీ అమర్ దీప్‌కి దక్కదు. అలాగే శోభ, ప్రియాంకలను అసిస్టెంట్లు గా పెట్టుకోకూడదే కండీషన్ పెట్టాడు… అంతేకాదు గేమ్ లు సరిగ్గా ఆడలేదని క్లాస్ కూడా పీకాడు..
ఆ తర్వాత బుక్ లను నచ్చినవారికి ఇవ్వమని చెప్పాడు.. ఇక అందరు ఇవ్వడం ఒక ఎత్తయితే.. గౌతమ్ మాత్రం తాను చెప్పిందే కరెక్ట్ అంటూ వాధించాడు.. ఈ క్రమంలో గయ్యాలి కాకుండా గమ్మున ఉండటం ఎలా అనేది అమర్ దీప్‌కి ఇచ్చాడు. గౌతమ్.. ప్రతి దాన్నిరైట్స్ అనుకోకుండా ఉండటం ఎలా ? అనే పుస్తకాన్ని శివాజీకి ఇచ్చాడు. శివాజీ.. కుళ్లు కుతంత్రాలు లేకుండా ఉండటం ఎలా అనేదాన్ని గౌతమ్‌కి ఇచ్చాడు. అర్జున్.. ఎక్స్ ట్రాలు ఆపడం ఎలా ? అనే పుస్తకాన్ని అమర్ దీప్‌కి ఇచ్చాడు. ఇలారెండు పుస్తకాలు వచ్చాయి… ఈ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే, ఈ వారంలో అర్జున్, శివాజీ, ప్రశాంత్, గౌతమ్, శోభా శెట్టి, ప్రియాంక, యావర్ నామినేషన్‌లో ఉన్నారు. డైరెక్ట్ అర్జున్‌ఫైనల్‌కి వెళ్లడంతో ఆయన నామినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. గౌతమ్ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.. చూడాలి ఎవరు అవుతారో..