యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, స్క్రీన్ ప్లే మాస్టర్ వెంకట్ ప్రభుతో కలిసి చేసిన బైలింగ్వల్ సినిమా ‘కస్టడీ’. సాలిడ్ ప్రమోషన్స్ తో చైతన్య కస్టడీ మూవీకి మంచి బజ్ జనరేట్ చేశాడు. ప్రమోషనల్ కంటెంట్ కూడా బాగుండడంతో కస్టడీ సినిమాపై అంచనాలు పెరిగాయి. చైతన్య హిట్ కొడతాడు అనే నమ్మకాన్ని కలిగించిన కస్టడీ మూవీ మే 12న ఆడియన్స్ ముందుకి వచ్చింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మార్నింగ్ షోకే డివైడ్ టాక్ రావడంతో, మొదటి రోజు కలెక్షన్స్ వీక్ గా కనిపించాయి. సెకండ్ డే వీకెండ్ కావడంతో కస్టడీ సినిమా రెండో రోజైనా మంచి కలెక్షన్స్ ని రాబడుతుందేమో అని అక్కినేని ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ కస్టడీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు కనీసం కోటి కూడా రాబట్టలేకపోయింది. రెండో రోజు కస్టడీ సినిమా కలెక్ట్ చేసింది 80 లక్షల షేర్ మాత్రమే. చైతన్య సినిమాకి ఇంత వీక్ కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి.
గతంలో ఫ్లాప్ అయిన సినిమా సినిమాలతో కూడా చైతన్య మంచి కలెక్షన్స్ నే రాబట్టాడు కానీ కస్టడీ మూవీనే బాక్సాఫీస్ దగ్గర మరీ వీక్ గా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వెంకట్ ప్రభుకి మంచి మార్కెట్ ఉన్న తమిళనాడులో కూడా కస్టడీ సినిమాని చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్ళట్లేదు. అక్కడ కస్టడీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది, రెండో రోజు తమిళనాడులో కస్టడీ సినిమా కలెక్ట్ చేసింది 15 లక్షలు మాత్రమే. దీంతో ఓవరాల్ గా రెండు రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 3.68 కోట్లు షేర్ రూ. 7.15 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. అంటే.. రూ. 25 కోట్లు టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా మరో 21.32 కోట్లు కలెక్ట్ చెయ్యాల్సి ఉంది. ఇప్పుడున్న బుకింగ్స్ అండ్ టాక్ చూస్తుంటే కస్టడీ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవ్వడం చాలా కష్టంగా కనిపిస్తోంది. కస్టడీ మూవీ బయ్యర్స్ అందరికీ భారి నష్టాలు మిగిలించేలా ఉంది.