అక్కినేని హీరోలు అనగానే బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్, సూపర్బ్ సాంగ్స్, హీరో అనే పదానికి పర్ఫెక్ట్ గా సరిపోయే కటౌట్స్ ఉన్న హీరోలు గుర్తొస్తారు. ఏఎన్నార్ నుంచి అఖిల్ వరకూ ప్రతి అక్కినేని హీరో చాలా అందంగా కనిపిస్తూ, అమ్మాయిలని అభిమానులుగా మార్చుకుంటూ ఉంటారు. ఈరోజుకీ గర్ల్స్ లో నాగార్జునకి ఉన్న ఫాలోయింగ్ యంగ్ హీరోలకి కూడా లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ లో ఒకటైనా కూడా అక్కినేని హీరోలు ఏ రోజూ ఏ కాంట్రవర్సీల జోలికి వెళ్లరు. తమ సినిమాలు చేసుకుంటారు, ఏవో వ్యాపారాలు చేసుకుంటారు, అభిమానులని అలరిస్తారు అంతే. ఇది మాత్రమే తెలిసిన అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ లు గతేడాదిగా అభిమానులని డిజప్పాయింట్ చేస్తున్నారు. ముందుగా నాగార్జున గురించి మాట్లాడుకుంటే… కింగ్ నాగ్ ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. 2018 నుంచి ఆయన నటించిన ఆరు సినిమాల్లో హిట్ అయ్యింది ఒక్కటే… ‘బంగార్రాజు’. సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు మినహా నాగార్జున లిస్టులో హిట్ అనే పదం చూసి చాలా రోజులే అయ్యింది.
ఇక అఖిల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. డెబ్యు నుంచి కెరీర్ కష్టాలని ఫేస్ చేస్తున్న అఖిల్, MEB సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కినట్లే కనిపించాడు కానీ ‘ఏజెంట్’ సినిమా మళ్లీ దెబ్బేసింది. అయ్యగారిని మళ్లీ రీలాంచ్ చెయ్యండి, అయ్యగారు మీరు IPLలోకి వెళ్లిపోండి అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి అంటే అది ఏజెంట్ సినిమా పుణ్యమే. ఈ మూవీ కోసం అఖిల్ ఎంత కష్టపడినా, కథలో విషయం లేకపోవడంతో నెగటివ్ రిజల్ట్ ని ఫేస్ చెయ్యాల్సి వచ్చింది. అక్కినేని హీరోల్లో బెటర్ ఫేజ్ లో ఉన్నది నాగ చైతన్య మాత్రమే. ఈ యువసామ్రాట్ నటించిన లాస్ట్ 6 మూవీస్ లో 3 హిట్స్ ఉన్నాయి. అయితే నాగ చైతన్య నటించిన లాస్ట్ మూవీ ‘థాంక్యు’ మాత్రం అక్కినేని ఫాన్స్ కి కూడా డిజప్పాయింట్ చేసింది.
కస్టడీ సినిమాతో ఆ డిజప్పాయింట్మెంట్ కి చైతన్య ఎండ్ కార్డ్ వేస్తాడని, అఖిల్-నాగార్జునలు ఫాన్స్ ని నిరాశ పరిచినా చై పక్కా హిట్ కొడతాడులే అని అక్కినేని అభిమానులు నమ్మరు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో చైతన్య ఫెయిల్ అయ్యాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన కస్టడీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో చైతన్య కూడా ఫ్లాప్ ఇస్తున్న నాగార్జున, అఖిల్ లతో చేరిపోయాడు. కస్టడీ కూడా ఫ్లాప్ అవ్వడంతో అసలు అక్కినేని హీరోలకి ఏం అయ్యింది? ఎవరూ హిట్ కొట్టరేంటి? అనే చర్చలు అభిమానుల్లోనే స్టార్ట్ అయ్యాయి. మరి లాస్ట్ మూడు సినిమాలతో ఫ్లాప్స్ ని ఇచ్చిన ముగ్గురు అక్కినేని హీరోలు ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతారు? అక్కినేని ఫ్యామిలీకి హిట్ ఇచ్చే ఆ డైరెక్టర్ ఎవరు అనేది చూడాలి.