భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ముందు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా కాన్ఫరెన్స్ లో కీలక విషయాలు వెల్లడించాడు. ఆస్ట్రేలియా చివరి ఎనిమిది మ్యాచ్‌లలో విజయం సాధించినందుకు తనకు ఎటువంటి ఇబ్బంది లేదని రోహిత్ శర్మ చెప్పాడు. అంతేకాకుండా.. ఈ ప్రపంచకప్ కోసం రెండేళ్ల కిందటే సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిపాడు. ఇరుజట్లు ఆడగల సామర్థ్యం కలిగిన జట్లుగా రోహిత్ శర్మ తెలిపాడు. ఈ ఫైనల్ మ్యాచ్.. తన కెరీర్ లోనే ఎంతో గొప్పదని హిట్‌మ్యాన్ చెప్పాడు. తాను 50 ఓవర్ల ప్రపంచకప్ చూస్తూ పెరిగానని చెప్పుకొచ్చాడు. జట్టులో ఏ ఆటగాడు ఏ పాత్ర పోషించాలన్న దానిపై స్పష్టత ఉందని, అప్పగించిన బాధ్యతలు నెరవేర్చగల సరైన ఆటగాళ్లను గుర్తించి వారిని జట్టులోకి తీసుకున్నామని వివరించాడు.
World Cup 2023 Final: వరల్డ్ కప్ ఫైనల్.. బెట్టింగ్‌రాయుళ్లపై ప్రత్యేక నిఘా
ప్లేయింగ్ ఎలెవన్ పై ఏమన్నాడంటే..?
ఫైనల్ మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్ గురించి మాట్లాడుతూ.. మొత్తం 15 మంది ఆటగాళ్లు ఆడే అవకాశం ఉందని భారత కెప్టెన్ చెప్పాడు. ఈరోజు పిచ్ పరిస్థితులను పరిశీలించామని.. రేపు పిచ్ పరిస్థితులను పరిశీలిస్తామని చెప్పారు. మరోవైపు 12-13 మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని, కానీ ప్లేయింగ్ ఎలెవెన్ సెట్ కాలేదని తెలిపాడు.
పిచ్ స్వభావం
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో గ్రీనరీ లేదని, అయితే ఈసారి తేలికపాటి గ్రీనరీ ఉందని చెప్పాడు. నేను ఈ రోజు పిచ్ చూడలేదు, కానీ అది నెమ్మదిగా ఉంటుందని తెలిపాడు. రేపు పిచ్ చూసి పరిస్థితులను తెలుసుకుంటామన్నాడు.
టాస్ కీలకం కానుందా?
ఫైనల్ మ్యాచ్లో టాస్ ముఖ్యం కాదని రోహిత్ శర్మ చెప్పాడు. పరిస్థితులు అర్థం చేసుకుని మంచి క్రికెట్ ఆడతామని తెలిపాడు.
షమీ గురించి..
ఈ వరల్డ్ కప్ లో 23 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన మహ్మద్ షమీ గురించి కూడా రోహిత్ మాట్లాడాడు. టోర్నీ తొలి భాగంలో షమీని జట్టులోకి తీసుకోకపోవడం కఠినమైన అంశం అని అభిప్రాయపడ్డాడు. అయితే ఆ సమయంలో షమీ… సిరాజ్, ఇతర పేసర్లకు ఎంతో మద్దతుగా నిలిచాడని కొనియాడాడు. నెట్స్ లో షమీ తన బౌలింగ్ కు మరింతగా సానబెట్టుకున్నాడని కితాబునిచ్చాడు.