PCOS: పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది మహిళల్లో ఓ హార్మోన్ల సమస్య. ఇది అండాశయాలలో చాలా చిన్న తిత్తులు ఏర్పడటానికి కారణమవుతుంది. దీని కారణంగా అండాశయాలు సరిగా పనిచేయలేవు. PCOS కేవలం శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, మహిళల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
TB Disease: ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే టిబి కావొచ్చు.. జాగ్రత్త సుమీ
PCOS అంటే?
PCOS అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఈ మధ్యకాలంలో మహిళల్లో ఇదొక సాధారణ సమస్యగా మారుతోంది. ఇందులో హార్మోన్ల అసమతుల్యత వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమస్యతో బాధపడుతున్న మహిళల్లో ఒత్తిడి, డిప్రెషన్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. మరి PCOS వ్యాధి సంబంధించిన లక్షణాలను చూస్తే..
* బరువు పెరగడం, మొటిమలు వంటి శారీరక మార్పులు ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి.
* పిసిఒఎస్‌కి సంబంధించిన ఒత్తిడి, ఆందోళన సంబంధాలలో ఒత్తిడిని కలిగిస్తాయి.
* పిసిఒఎస్‌తో బాధపడుతున్న మహిళల్లో సెరోటోనిన్ స్థాయిలు తగ్గుతాయి.
* సెరోటోనిన్‌ను హ్యాపీ హార్మోన్ అంటారు. ఇది లేకపోవడం వల్ల మహిళలు తక్కువ అనుభూతి చెందుతారు.
Sarfaraz-Pant: భాయ్ వెనక్కి వెళ్లిపో.. చిన్నపిల్లాడిలా గంతులేసిన సర్ఫరాజ్! నవ్వుకుండా ఉండలేరు
నివారణ చర్యలు:
* పెరుగుతున్న బరువును నియంత్రించడం ద్వారా PCOS సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు.
* ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా శరీరం అనేక తీవ్రమైన వ్యాధుల నుండి రక్షించబడుతుంది.
* ధ్యానం, యోగా చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
* మీ ఆహారంలో ఆరోగ్యకరమైన వాటిని చేర్చుకోండి. ఇది పిసిఒఎస్ లక్షణాలను తగ్గించడంలో, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
* ఇది అండాశయాల నుండి హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
* మందులు తీసుకోవడం ద్వారా నిరాశ, ఆందోళన వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.