Sarfaraz Khan Stopping Rishab Pant to not take Run: బెంగళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు మళ్లీ వర్షం అడ్డంకిగా మారింది. నాలుగో రోజైన శనివారం తొలి సెషన్ చివరలో వర్షం రావడంతో.. అంపైర్లు ఆటను నిలిపివేసి లంచ్ విరామాన్ని ప్రకటించారు. ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. ఇంకా 12 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో సర్ఫరాజ్ ఖాన్ (125), రిషబ్ పంత్ (53) ఉన్నారు. అయితే నాలుగో రోజు ఆటలో ఓ ఫన్నీ సంఘటన జరిగింది.
భారత్ రెండో ఇన్నింగ్స్ 56వ ఓవర్‌లో సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ మధ్య సమన్వయలోపంతో రనౌట్ అయ్యే ప్రమాదం తృటిలో తప్పింది. కివీస్ పేసర్ మాట్ హెన్రీ 56వ ఓవర్‌లో మొదటి బంతి వేయగా.. సర్ఫరాజ్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న పంత్.. మొదటి రన్ పూర్తిచేసి రెండో పరుగు కోసం పరుగెత్తుతున్నాడు. బంతిని ఫీల్డర్ అందుకోవడంను గమనించిన సర్ఫరాజ్.. నో, నో అంటూ గట్టిగా అరిచాడు. ఇది గమనించని పంత్.. పరుగెత్తుతూ వచ్చాడు. దాంతో సర్ఫరాజ్ భాయ్ వెనక్కి వెళ్లిపో అంటూ గట్టిగా అరుస్తూ.. పిచ్‌పై గంతులేశాడు. ఇది చూసిన పంత్ వెనక్కి వెళ్ళిపోయాడు.
Also Read: IND vs NZ: బాబోయ్ మళ్లీ వచ్చేశాడు.. నిలిచిన బెంగళూరు టెస్టు! 12 పరుగుల వెనుకంజలో భారత్
పంత్ క్రీజులోకి వెళ్లకముందే కీపర్ చేతుల్లోకి బంతి వచ్చినా.. అతడు వికెట్లకు విసరలేకపోయాడు. దాంతో పంత్ రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వెంటనే పంత్ వద్దకు వెళ్లిన సర్ఫరాజ్.. చూసుకోవా అంటూ సైగలు చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చిన్నపిల్లాడిలా గంతులేసిన సర్ఫరాజ్‌ను చూసి అందరూ నవ్వుకుంటున్నారు. అప్పటికి పంత్ కేవలం 6 రన్స్ మాత్రమే చేశాడు. మరోవైపు సర్ఫరాజ్ 95 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు.
Sarfaraz Khan Stopping Rishab pant to not take run 😂. #RishabhPant #INDvsNZ #sarfrazkhan #RohitSharma #RishabhPant #ViratKohli𓃵 pic.twitter.com/xPlfmibwfK
— Ravindra kumar fatyan (@FatyanKumar) October 19, 2024