Pawan Kalyan Kakinada Tour: జనసేనాని పవన్ కల్యాణ్.. కాకినాడపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపటి నుంచి మూడు రోజులపాటు కాకినాడలో ఉండనున్నారు.. అమలాపురం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లతో విడిగా విడిగా సమావేశం కానున్నారు.. గత వారంలో మూడు రోజులు కాకినాడ లోనే ఉన్న పవన్ కల్యాణ్.. కాస్త విరామం తర్వాత మళ్లీ పర్యటించనున్నారు.. కాకినాడ సిటీ పై ప్రత్యేక దృష్టి పెట్టారు సేనాని.. డివిజన్ల వారీగా నేతలు కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు మొత్తం 50 డివిజన్ లలో 22 డివిజన్ ల రివ్యూ ముగిసింది.. మిగతా డివిజన్ లు రివ్యూ ఈ పర్యటనలో చేయనున్నారు..
Read Also: Mark Zuckerberg: భూగర్భ బంకర్‌ను మార్క్ జుకర్‌బర్గ్.. 270 మిలియన్ డాలర్లు ఖర్చు
ఇక, గతంలో వారాహి యాత్ర సమయంలో పవన్ కల్యాణ్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడిచాయి.. దమ్ముంటే తనపై పోటీ చేయాలని ద్వారంపూడి.. పవన్ కళ్యాణ్ కు సవాల్ చేస్తే.. ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని ద్వారంపూడికి ప్రతిసవాల్ చేశారు పవన్.. స్థానిక నేతలు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ ను కాకినాడ సిటీ నుంచి పోటీ చేయమని కోరుతున్నారు.. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుందామని ఆయన చెప్పారు.. టార్గెట్ కాకినాడ సిటీగా స్ట్రాటజీ అమలు చేస్తున్నారు కల్యాణ్. మరోవైపు తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీల పొత్తులో భాగంగా కాకినాడ పార్లమెంట్ జనసేనకు రానుంది.. దానికి తగ్గట్టుగా పార్లమెంట్ సీటుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు జనసేనాని.. ఇక, కాకినాడ సిటీ అసెంబ్లీ స్థానంపై కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టిసారించారు. పవన్ వరుస పర్యటనలతో.. అక్కడే ఎందుకు? వారం రోజుల్లో రెండుసార్లు పర్యటన వెనుక మర్మం ఏంటి? ఆయన అక్కడే నుంచి బరిలో దిగుతారా?అందుకే అక్కడ టార్గెట్ పెట్టారా? అనే చర్చ విస్తృతంగా సాగుతోంది.