గత వారంలో మూడు రోజులు కాకినాడ లోనే ఉన్న పవన్ కల్యాణ్.. కాస్త విరామం తర్వాత మళ్లీ పర్యటించనున్నారు.. కాకినాడ సిటీ పై ప్రత్యేక దృష్టి పెట్టారు సేనాని.. డివిజన్ల వారీగా నేతలు కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు మొత్తం 50 డివిజన్ లలో 22 డివిజన్ ల రివ్యూ ముగిసింది.. మిగతా డివిజన్ లు రివ్యూ ఈ పర్యటనలో చేయనున్నారు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పాటు కాకినాడలో మకాం వేయనున్నారు.. దీనికోసం బుధవారం రోజు కాకినాడ చేరుకున్నారు జనసేనాని.. ఇక, మూడు రోజుల పాటు అంటే.. ఈ నెల 28, 29, 30 తేదీల్లో అక్కడే మకాం వేయనున్నారు.