Pakistan: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సుల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తు్న్న బస్సు కాలువలో పడిపోవడంతో 29 మంది మరణించారు. ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు హవేలీ కహుటా నుంచి రావల్పిండికి 30 మంది ప్రయాణికులతో వెళ్తున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. పానా బ్రిడ్జికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పర్వత ప్రాంతాల్లో ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Read Also: Kiren Rijiju: మిస్ ఇండియాలో దళితులు లేరు.. రాహుల్ గాంధీవి ‘‘బాల బుద్ధి’’ వ్యాఖ్యలు..
పాకిస్తాన్‌లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం. రోడ్డు మార్గాలు, రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడం, కొండలు, పర్వతాలు, లోయల గుండా రోడ్లు ఉండటంతో ప్రమాదాలు జరుగుతంటాయి. అంతకుముందు మంగళవారం 51 మంది పాకిస్తానీలతో కూడిన బస్సు ఇరాన్ వెళ్తుండగా, రాత్రి సమయంలో యాజ్డ్ ప్రావిన్సులోని చెక్ పాయింట్ ముందు బోల్తా పడి మంటలు అంటుకున్నాయి. బ్రేక్ ఫెయిల్యూర్ రోడ్డు ప్రమాదానికి కారణమని ఇరాన్ ట్రాఫిక్ పోలీస్ హెడ్ టేమ టేమర్ హుస్సేనీ చెప్పారు. ఈ ఘటనలో మరణించిన 28 మంది యాత్రికులు మృతదేహాలను పాకిస్తాన్‌కి పంపించారు.