Kurnool Bus Accident: 19 మంది సజీవ దహనం అయిన కర్నూలు బస్సు ప్రమాదం కేసులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.. ప్రమాద తీవ్రత పెంచడంలో బైక్‌లో పెట్రోలు, బస్సులోని డీజిల్‌తో పాటు.. లగేజీ కేబిన్‌లో ఉన్న సెల్ ఫోన్ల పాత్ర కీలకంగా భావిస్తున్నారు.. బైక్ ను ఢీకొన్న బస్సు.. బంపర్‌లో చిక్కుకుపోయిన బైక్‌ను 300 మీటర్ల వరకు ఈడ్చుకు పోవడంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయి బస్సు కింద రోడ్డు పొడవునా పెట్రోల్ పడడంతో…
దేశంలో పలు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోంది. దీంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. చాలా చోట్ల కొట్లాటలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే డ్రైవర్లు, కండక్టర్లతో గొడవ పడిన దాఖాలు ఉన్నాయి.
ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో భారీగా ప్రాణ నష్టం జరుగుతోంది. తాజాగా మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ మెక్సికోలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 41 మంది మరణించారు. 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టిందని మెక్సికోలోని టబాస్కో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగడంతో ఈఘోరం చోటుచేసుకుందని…
Punjab Bandh: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఖనౌరీ సరిహద్దులో గత 34 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్‌కు మద్దతుగా ఈరోజు (డిసెంబర్ 30) పంజాబ్ బంద్‌ను రైతులు ప్రకటించారు.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో వేగంగా వెళ్తున్న బస్సు... పికప్‌ను బలంగా ఢీకొట్టడంతో జరిగిన ఘోర ప్రమాదం జరిగింది. పికప్‌లో సుమారు 35 మంది ఉన్నారు.
యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. బొలెరో, ఏసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. ఇందులో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. 10 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఆగ్రా అలీగఢ్ బైపాస్ రోడ్డులోని మాటై గ్రామ సమీపంలో ఈరోజు సాయంత్రం ప్రమాదం జరిగింది. బస్సు ఆగ్రా నుంచి డెహ్రాడూన్ వెళ్తున్నట్లు సమాచారం.
తమిళనాడులో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. చెయ్యార్ పట్టణం సమీపంలో చెన్నైకి వెళ్తున్న వ్యాన్, బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అక్కడున్న సీసీటీవీలో రికార్డు అయింది. కాగా.. ఈ ప్రమాదం జరగ్గానే ఇద్దరు ప్రయాణికులు కొద్దిసేపు గాల్లోనే ఉండి కిందపడ్డారు.
జమ్మూ కాశ్మీర్ లేహ్‌లోని దుర్గుక్ ప్రాంతంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు 200 మీటర్ల లోతైన లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మరో 19 మంది గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఆరోగ్యం క్షీణించి బస్సులోనే ప్రయాణికుడు మృతి చెందిన ఘటన ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది. హల్ద్వానీ నుంచి కౌసాని వెళ్తున్న కేము బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి ఆరోగ్యం శుక్రవారం క్షీణించింది. దీంతో బస్సు డ్రైవర్ ఆ ప్రయాణికుడిని భవాలీ సీహెచ్‌సీకి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న యువకుడి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.