మనకు ఫోటోలు తీయడం.. దిగడం అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. కొన్ని ఫోటోలు మనకి తెలుసు మనకి నచ్చి మన కంప్యూటర్ మీద.. మొబైల్ ఫోన్ల మీద వాల్ పేపర్లుగా కూడా పెట్టేసుకుంటాం.. అలా మీకు ఎంతో పరిచయం ఉన్న ఓ ఫోటో గురించి చెప్పాలి. ఈ ఫోటోను ఖచ్చితంగా మీ కంప్యూటర్ వాల్ మీద వాడే ఉంటారు.. మీరు. Windows XP వాడిన వాళ్లకు ఈ ఫోటో గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డిఫాల్ట్ పేపర్ బ్లిస్ దీన్ని చూడగానే ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. పచ్చని పచ్చికబయలు, నీలిరంగు ఆకాశంలో తెల్లగా పరిచిన మేఘాలు చూడగానే ముచ్చట గొలిపే ఫోటో ఇది.
Read Also : Revanth Reddy : ఈడీ అధికారులకు అభినందనలు.. కానీ సీబీఐ స్పందించడం లేదు
అయితే ఈ ఫోటోను 2000 సంవత్సరంలో ఈ వాల్ పేపర్ ని అందరూ వాడే ఉంటారు. ఈ ఫోటోకి ఓ చరిత్ర కూడా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించిన ఫోటోగా గుర్తింపు దక్కించుకుంది. అయితే ఈ ఫోటో ఎవరు తీశారు.. అనేది చాలా మందికి తెలియదు. 1996లో చార్లెస్ ఓ రియల్ అనే వ్యక్తి ఈ ఫోటోని తీశారు. అప్పట్లో అంటే 2000 సంవత్సరంలో మైక్రో సాఫ్ట్ ఈ ఫోటో హక్కుల్ని కొనుగోలు చేసింది. ఈ ఫోటోని బిలియన్ల మంది చూసారని అంచనా వేశారు. గతంలో చార్లెస్ మారిన్ కౌంటికీ వెళ్లినప్పుడు ఈ ఫోటోని తీశాడు. 20 సంవత్సరాల తర్వాత తన భార్య డాఫ్నే లార్కిన్ తో కలిసి మళ్లీ అదే ప్రదేశానికి వెళ్లినప్పుడు అప్పటి ఫోటో ఫ్రేమ్ ను వెంట తీసుకెళ్లాడు చార్లెస్. అలా ఈ ఫోటో చార్లెస్ మరలా వార్తల్లోకి ఎక్కారు.
Read Also : Shiveluch Volcano Erupts: రష్యాలో బద్దలైన అగ్నిపర్వతం.. విమానాలకు రెడ్ అలర్ట్