హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపేందుకు రేవంత్ రెడ్డి నిన్న రాత్రి నుంచే డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఈ డ్రామాను ప్రజలు గమనిస్తున్నారని, తనపై జరుగుతున్న కుట్రలకు తాను భయపడనని స్పష్టం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. “మా లీగల్ టీమ్‌కు పేరు పేరునా కృతజ్ఞతలు. నన్ను జైలుకు పంపాలని ఎన్ని కుట్రలు చేసినా భయపడను.
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట లభించింది. కౌశిక్‌రెడ్డి రిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. క్వారీ యజమాని మనోజ్ రెడ్డిని బెదిరించిన కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పాడి కౌశిక్‌రెడ్డి క్వారీ యజమాని భయభ్రాంతులకు గురి చేశారని.. అతడికి రిమాండ్ విధించాలంటూ పీపీ వాదించారు. క్వారీ యజమాని మనోజ్ రెడ్డి కుటుంబ ఇప్పటికీ భయపడుతోందని ప్రభుత్వ అడ్వకేట్ తెలిపారు.
క్వారీ యజమాని మనోజ్ రెడ్డి బెదిరింపు కేసులో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కాజీపేట లోని రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14 రోజుల రిమాండ్ విధించారు. కౌశిక్ రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. పటిష్ట భద్రత నడుమ కౌశిక్ రెడ్డిని ఖమ్మం తరలించనున్నారు. అర్ధరాత్రి అరెస్ట్ అనంతరం.. ఉదయం నుంచి సుబేదారి పిఎస్ దగ్గర హైడ్రామా కొనసాగతోంది.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. కోర్టులో హాజరుపరచే ముందు.. వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకు తరలించారు. ఆస్పత్రిలోకి వెళ్లే ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు.. ఈ కాంగ్రెస్ సర్కార్ 20% కమీషన్ సర్కార్.. పోలీస్ ఆఫీసర్ల దగ్గర కమీషన్స్ తీసుకుంటున్నారు ఎమ్మెల్యే నాగరాజు.. అక్రమ మైనింగ్ చేస్తున్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోకపోవడం హాస్యస్పదం.." అని వ్యాఖ్యానించారు. అంతలోపే…
సుపరిపాలన.. తొలి అడుగు పేరుతో వార్షికోత్సవ సభ.. ఎల్లుండే కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవ సభ ఎల్లుండి జరగనుంది. సుపరిపాలన.. తొలి అడుగు పేరుతో సభ నిర్వహించనున్నది ఏపీ ప్రభుత్వం. ఏపీ సచివాలయం వెనక ప్రాంతంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు.. భవిష్యత్తు కార్యాచరణ.. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ వివరించనున్నారు. ప్రభుత్వం ప్రాధాన్యాలు.. పి 4పై ప్రత్యేక పవర్ పాయింట్…
Padi Kaushik Reddy : హుజురాబాద్MLA పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. అయితే… కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే సుబేదారి పోలీస్ స్టేషన్‌కు బీఆర్‌ఎస్ లీగల్ టీం చేరుకుంది. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని కుట్రలు చేసినా… రేవంత్ రెడ్డికి తలవంచం నిలదీస్తూనే ఉంటామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీల ద్వారా నడిపిస్తున్న క్వారీ పనులను ప్రశ్నించినందుకే తన…
జూలియన్ వెబర్ పై ప్రతీకారం తీర్చుకున్న నీరజ్ చోప్రా.. పారిస్ డైమండ్ లీగ్ లో విజయం పారిస్ డైమండ్ లీగ్ 2025 పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మొదటి స్థానాన్ని గెలుచుకున్నాడు. జూన్ 20న (శుక్రవారం) పారిస్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో నీరజ్ తన సమీప ప్రత్యర్థి జర్మనీకి చెందిన జూలియన్ వెబర్‌ను ఓడించాడు. గత రెండు టోర్నమెంట్లలో నీరజ్ వెబర్ చేతిలో ఓడిపోయాడు, కానీ ఇప్పుడు ఆ…
పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో తన నియోజకవర్గం హుజురాబాద్‌లో పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. మంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మీడియా మిత్రులకు సరైన భోజనం కూడా పెట్టలేని ప్రభుత్వం ఇది అని ఎద్దేవా చేశారు. శాసన సభ్యుడుగా తనకే భద్రత లేకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏంటి? అని హుజురాబాద్ ఎమ్మెల్యే…
నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. విచారణ జరపనున్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. ఫిరాయింపుల అంశంపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌ను బీఆర్ఎస్ నేతల పిటిషన్లను ట్యాగ్ చేసే అవకాశం ఉంది.…