ఈరోజుల్లో పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారు.. ఉద్యోగాలు చెయ్యడం వల్ల మంచి సంపాదన లేకపోవడంతో ఎక్కువ మంధి యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. ఈరోజుల్లో మార్కెట్ లో బ్లూ బెర్రీస్ పండ్లకు మంచి డిమాండ్ ఉండటంతో ఎక్కువ మంది ఈ వ్యవసాయాన్ని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. ఈరోజు మనం ఈ పండ్ల సాగు ఎలా చేస్తే మంచి లాభలున్నాయని నిపుణుళు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..
ఒకప్పుడు ఒకలా ఉండే వ్యవసాయంలో చేసే పద్ధతుల్లో కూడా పెను మార్పులు వచ్చాయి. అయితే సాంప్రదాయ పద్ధతిలో కాకుండా ఆధునిక, శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసి లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.కొందరు యువ రైతులు స్వదేశీ పంటలతో పాటు విదేశీ పండ్లు, విదేశీ కూరగాయలను పండిస్తున్నారు.. .మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలను పండిస్తే లక్షల ఆదాయాన్ని పొందవచ్చు. బ్లూ బెర్రీ పంటను సాగు చేస్తే పెట్టుబడి కంటే ఎన్నో రెట్ల ఆదాయాన్ని పొందవచ్చు.బ్లూ బెర్రీ చాలా ఖరీదైన పండు.
మన దేశంలో కొన్ని మార్కెట్లలో కిలో ధర రూ.1000 పలుకుతోంది.ఈ బ్లూ బెర్రీ పండు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందడం వల్లే మంచి ధర పలుకుతుంది.. భారీగా దిగుమతి అవుతోంది.. ఒకసారి ఈ పంటలను వేస్తె పదేళ్ల వరకు దిగుబడి పొందవచ్చు..ప్రిల్, మే నెలలు చాలా అనుకూలంగా ఉంటాయి.నాటిన పది నెలల తర్వాత పంట చేతికి వస్తుంది.అంటే ఫిబ్రవరి- మార్చి తరువాత పండ్లను కోయవచ్చు. దాదాపుగా జూన్ వరకు పంట దిగుబడి వస్తుంది. వర్షాకాలం వచ్చిన తర్వాత బ్లూబెర్రీ మొక్కలకు కత్తిరింపులు చేయాలి.. ఒక ఎకరాకు 3000 వేల మొక్కలను నాటవచ్చు..ఒక మొక్క నుండి దాదాపుగా రెండు కిలోల బ్లూబెర్రీ పండ్ల వడి పొందవచ్చు.డ్రిప్ విధానంలో నీటిని అందించి, ఎప్పటికప్పుడు కలుపును తొలగిస్తూ ఎరువులను వేస్తూ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.. అధిక లాభాలను పొందవచ్చు..