Harassment Assault: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంకకు చెందిన ఒక అమ్మాయికి ఏడాది క్రితం స్నాప్ చాట్ ద్వారా కర్నూలు జిల్లాకు చెందిన పైడిపోగు హరీష్ పరిచయమైయ్యాడు. అయితే, ఇద్దరూ ఫోన్ మాట్లాడుకుంటూ అప్పుడప్పుడూ న్యూడ్ వీడియో కాల్స్ కూడా మాట్లాడుకున్నట్లు సమాచారం. అయితే, న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుకునే సమయంలో యువతికి తెలియకుండా స్క్రీన్ షాట్స్ తీసి డబ్బులు ఇవ్వాలని సదరు వ్యక్తి డిమాండ్ చేశారు.
Read Also: Chhattisgarh: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. మావో అగ్ర నేతలు హతం
ఇక, తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో స్క్రీన్ షాట్స్ తీసిన న్యూడ్ ఫోటోలను ఆమె పేరుతో మూడు కొత్త ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ ఓపెన్ చేసి వాటిలో న్యూడ్ ఫొటోస్ లను పోస్ట్ చేశాడు కర్నూలు జిల్లాకు చెందిన పైడిపోగు హరీష్. ఇక, ఈ ఘటనపై హరీష్ పై బాధితురాలు ఆలమూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ఈ మేరకు నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆలమూరు ఎస్ఐ మాట్లాడుతూ.. యువతులు, మహిళలు సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని.. తెలియని వ్యక్తులతో వీడియో కాల్స్ లాంటి పనులు చేయొద్దని సూచించారు.