Singer Pravasthi : టాలీవుడ్ లో ఇప్పుడు పాడుతా తీయగా షో మీద నానా రచ్చ జరుగుతోంది. సింగర్ ప్రవస్తి ఈ షోమీద, జడ్జిల మీద చేసిన ఆరోపణలపై ఇప్పటికే సింగర్ సునీత, జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ వారు స్పందించారు. అయితే సునీత ఇచ్చిన రిప్లై మీద ప్రవస్తి మరో వీడియో రిలీజ్ చేసింది. అసలు సునీత చెప్పినవన్నీ అబద్దాలే అంటూ కొట్టి పారేసింది. ఏ ఒక్కటి కూడా నిజం లేదని వాపోయింది. మేడం మీరు వీడియోలో చక్కగా మాట్లాడారు. బయట కూడా అలాగే మాట్లాడితే ఇంకా బాగుండేది. మీరు చెప్పినట్టు నేను ఛానెల్ వాళ్లకు రైట్స్ ఉన్న పాటలే ఎంచుకున్నాను. కానీ నన్ను పాడొద్దన్నారు. అదే పాటను వేరే అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటే ఓకే చేశారు. నేను కొన్ని సార్లు మీరు ఓకే అన్న పాటకు రిహార్సల్స్ చేసిన తర్వాత కూడా క్యాన్సిల్ చేయించారు.
Read Also: Disha Patani : రెచ్చిపోయిన దిశా పటానీ.. ఆ ఫోజులు చూస్తే..
మ్యాంగో మ్యూజిక్ లో మీరు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. మా గురువు నిహాల్ కొండూరి ఇచ్చారు. నన్ను రాత్రిపూట మా ఇంటికి క్షేమంగా తీసుకొచ్చాం అన్నది అబద్దం. నేను ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారమే దింపారు. నేను కొన్ని పాటలు పాడక ముందే మీరు జడ్జిమెంట్ ఇచ్చారు. అలా ఎలా ఇస్తారు. కొందరు లిరిక్స్ మర్చిపోయి పాడినా సరే వారిని ఫైనల్ చేశారు. ఇంకొందరు చేతి మీద పాట రాసుకొచ్చి వచ్చినా సరే వాళ్లను ఫైనల్ కు పంపించారు. కానీ నన్ను మాత్ర మధ్యలోనే ఎలిమినేట్ చేశారు. నన్ను కీరవాణి గారు చాలా నీచంగా మాట్లాడారు. పెళ్లిళ్లలో పాటలు పాడుతుంది అంటూ అవమానించారు. దాన్ని మీరు కూడా ఎంకరేజ్ చేశారు. అలా ఎలా చేస్తారు మీరు.
నేను ఐదేళ్ల వయసు నుంచే సంగీత ప్రపంచంలో ఉన్నాను. ఎన్నో షోలలో పాల్గొన్నాను. మీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. మీరు ఒక లెజెండరీ సింగర్. నా అభిమాన సింగర్ మీరే. కానీ నాకు అన్యాయం జరిగింది కాబట్టే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇందులో ఎలాంటి తప్పు లేదు. మీలాగా సొంతంగా పాటలు షూట్ చేసి రిలీజ్ చేసేంత డబ్బు నాకు లేదు. కానీ అవమానం జరిగితే కచ్చితంగా ప్రశ్నిస్తాను. నా వెనక ఎవరూ లేరు. నేను నిస్సహాయురాలిని. నాకు తర్వాత ఛాన్సులు వచ్చినా రాకపోయినా బాధపడను’ అంటూ చెప్పుకొచ్చింది ప్రవస్తి.