జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం పర్యటకులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 28 మంది మరణించినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రతికారం తీర్చుకోవాలని భారతీయ పౌరులు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన హమాస్, ఇజ్రాయెల్ దాడిని గుర్తు చేస్తున్నారు. హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) అనవసరంగా ఇజ్రాయెల్‌తో కయ్యానికి కాలు దువ్వింది. ఆ దేశంపై దాడులు చేసి తన గోతి తానే తవ్వుకుంది. ఇజ్రాయెల్ ధాటికి హమాస్ చాలా నష్టపోవాల్సి వచ్చింది. దాడి జరిగిన కొన్ని గంటల్లో స్పందించిన ఇజ్రాయెల్ గాజాలో బాంబుల వర్షం కురిపించింది. ఇప్పుడు అదే రీతిలో పాకిస్థాన్ అనవసరంగా భారత్‌తో పెట్టుకుంటుందని నెటిజన్లు అంటున్నారు. ఇజ్రాయెల్ లాగానే భారత్ స్పందించి.. హసమాస్‌ను మట్టుబెట్టినట్లు పాకిస్థాన్‌ను లేపేయాలని డిమాండ్ చేస్తున్నారు.
READ MORE: RSS General Secretary: టూరిస్టులపై ఉగ్రదాడి.. పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి రావాలి..!
హమాస్- ఇజ్రాయెల్ మధ్యం ఏం జరిగింది?
అప్పట్లో హమాస్‌కి చెందిన సాయుధ విభాగం ఆకస్మిక దాడులు జరిపింది. ఏం జరుగుతుందో తెలియనంతగా అనూహ్య దాడి జరిగింది. గాజా, ఇజ్రాయెల్‌ను వేరు చేసే పటిష్టమైన కంచెను హమాస్ ధ్వంసం చేసి ఇజ్రాయెల్‌లోకి చొచ్చుకొచ్చి దాడి చేసింది. ఈ దాడుల్లో చనిపోయిన ఇజ్రాయెల్ పౌరులు, సైనికుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపించాయి. ఆయుధాలు ధరించిన హమాస్‌కి చెందిన కొందరు వ్యక్తులు సైనికులను, పౌరులను బంధీలుగా తీసుకెళ్తున్న దృశ్యాలు ఇజ్రాయెలీలను ఆగ్రహానికి గురిచేశాయి. వెంటనే స్పందించిన ఇజ్రాయెల్ కొన్ని గంటల్లోనే హమాస్‌కు బుద్ధి చెప్పింది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండానే తమపై దాడి చేయడంతో తీవ్రంగా మండిపడ్డ ఇజ్రాయెల్.. హమాస్‌ని పూర్తిగా తుడిచిపెట్టాలన్న దిశగా దూసుకుపోయింది. ఇజ్రాయెల్ వైమానిక దళాలు హమాస్ రహస్య స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. బిల్డింగులు, యూనివర్సిటీలు, మసీదులు.. ఇలా హమాస్ మిలిటెంట్లు ఎక్కడున్నా సరే, ఆ ప్రాంతాల్లో దాడులు చేశాయి. దీంతో.. గాజా మొత్తం చెత్త దిబ్బలాగా మారిపోయింది.
READ MORE: Pahalgam Terror Attack: కాశ్మీర్‌లో హై టెన్షన్ వాతావరణం.. ముష్కరుల కోసం వేట
ఇలా మెరుపు వేగంతో స్పందించిన ఇజ్రాయెల్‌ను ఆదర్శంగా తీసుకుని శత్రుదేశంలోని ఉగ్రస్థావరాలను లేకుండా చేయాలని, ఉగ్రవాదులను మట్టుబెట్టాలని నెటిజన్లు కోరుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో “#WeWantRevenge” అని ట్యాగ్ వైరల్ అవుతోంది. మరోవైపు ఈ ఘటనపై భారత ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. కేబినెట్ మీటింగ్ అనంతరం ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘటన వివరాలు, తదుపరి కార్యాచరణ వెల్లడించే అవకాశం ఉంది.