iQOO Z10x: భారత్ లో ఈ నెల ప్రారంభంలో iQOO Z10, iQOO Z10x స్మార్ట్‌ఫోన్లు అధికారికంగా లాంచ్ అయ్యాయి. ఇప్పటికే స్టాండర్డ్ Z10 అమ్మకాలు మొదలైనప్పటికీ, ఇప్పుడు iQOO Z10x కూడా అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ సెగ్మెంట్‌లో వచ్చినా ఈ స్మార్ట్‌ఫోన్ మెరుగైన స్పెసిఫికేషన్లను అందిస్తోంది. పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, హయ్యర్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మెడియాటెక్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు దీన్ని ఆకర్షణీయంగా మార్చుతున్నాయి.
iQOO Z10x ను ప్రస్తుతం వివో సబ్‌బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ప్లాట్‌ఫామ్స్‌లో కొనుగోలు చేయవచ్చు. బేస్ వేరియంట్ అయిన 6GB + 128GB ధర రూ.13,499గా ఉంది. ఐసీసీఐ, SBI క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల వినియోగదారులకు రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే మరింత తక్కువ ధరకు డివైస్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ అల్ట్రా మరైన్, టైటానియం రంగులలో అందుబాటులో ఉంది.
ఇక వీటిధారల విషయానికి వస్తే.. 6GB + 128GB మోడల్ ధర రూ.13,499, 8GB + 128GB మోడల్ ధర రూ.14,999, 8GB + 256GB మోడల్ ధర రూ.16,499 గా నిర్ణయించారు. ఈ మొబైల్ లో 6.72 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది తడిగా లేదా ఆయిల్ పట్టిన చేతులతో కూడా స్మూత్ గా పని చేస్తుంది. రెక్టాంగిల్ ఆకారంలో ఉన్న కెమెరా ఐలాండ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి. ఈ మొబైల్ లో IP64 సర్టిఫికేషన్‌తో వస్తుంది. అంటే నీటి చుక్కలు, దుమ్ము నుంచి రక్షణ ఉంటుంది.
ఇక ఇందులో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ వస్తుంది. ఇందులో గరిష్టంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వరకు లభిస్తుంది. ఈ ఫోన్ 6,500mAh కెపాసిటీ ఉన్న బ్యాటరీని కలిగి ఉంది. దీన్ని 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పై పని చేస్తుంది. ఇందులో AI Erase, AI Photo Enhance, AI Translation వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో రిఅర్ సైడ్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP బోకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందుభాగంలో 8MP కెమెరా ఉంది. ఇవన్నీ చూస్తే, iQOO Z10x బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో వచ్చిన స్మార్ట్‌ఫోన్ అని చెప్పొచ్చు. పెద్ద బ్యాటరీ, మంచి ప్రాసెసర్, ఫాస్ట్ చార్జింగ్, కొత్త ఆండ్రాయిడ్ వర్షన్ కావడం దీన్ని మరింత విలువైన ఆప్షన్‌గా నిలబెడుతోంది.