CMF Buds 2: ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ నథింగ్ తన సబ్-బ్రాండ్ CMF ద్వారా నూతన ఈయర్‌బడ్స్ “CMF Buds 2” ను అమెరికా, యూరప్, యూకే మార్కెట్లలో విడుదల చేసింది. భారత్‌లో ఈ బడ్స్ ఏప్రిల్ 28న CMF Buds 2a, Buds 2 Plus మోడల్స్‌తో కలిసి అధికారికంగా లాంచ్ కానున్నాయి. CMF Buds 2 మోడల్ ప్రత్యేక ఆకర్షణగా స్మార్ట్ డయల్‌ను కలిగి ఉంది. ఇది వాల్యూమ్ నియంత్రణ, ప్లేబ్యాక్ కంట్రోల్ కోసం ఉపయోగించవచ్చు. దీనిని Nothing X యాప్ ద్వారా అనేక ఫంక్షన్‌లకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఉదాహరణకు నాయిస్ క్యాన్సిలేషన్ నియంత్రణ, వాయిస్ అసిస్టెంట్ యాక్టివేషన్, Low Lag మోడ్‌కు మారడం తదితర ఫీచర్లు ఉన్నాయి.
ఈ బడ్స్‌లో 11mm PMI డ్రైవర్ అందించబడింది. ఇది SBC, AAC కోడెక్‌లకు మాత్రమే మద్దతు ఉంది. కానీ, Ultra Bass Technology 2.0 మరియు స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్‌తో మెరుగైన శబ్ద అనుభూతిని అందిస్తుంది. CMF Buds 2 హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ను 48dB వరకు మద్దతు ఇస్తుంది. ఈ బడ్స్ 6 మైక్రోఫోన్‌లతో క్లియర్ వాయిస్ టెక్నాలజీ 3.0, విండ్ – నాయిస్ రిడక్షన్ 3.0 కలిగి ఉండటంతో కాల్ క్లారిటీ చాలా బాగా మెరుగవుతుంది. బ్యాటరీ పరంగా బడ్స్ ఒక్కటే 13.5 గంటల ప్లేబ్యాక్ (ANC ఆఫ్), 7.5 గంటలు (ANC ఆన్) కలిగి ఉండగా, ఛార్జింగ్ కేసుతో కలిపి మొత్తం 55 గంటల బ్యాటరీ లైఫ్ కలుగుతుంది. 10 నిమిషాల క్విక్ ఛార్జ్‌తో 7.5 గంటల ప్లేబ్యాక్ సాధ్యపడుతుంది.
ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. బ్లూటూత్ v5.4, డ్యుయల్ కనెక్షన్, టచ్ కంట్రోల్స్, చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్, ఈక్వలైజర్స్, గేమింగ్ మోడ్ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఫోన్లతో కనెక్ట్ అయ్యే సమయంలో ఆటోమేటిక్‌గా Low Lag మోడ్ యాక్టివేట్ అవుతుంది. CMF Buds 2 డార్క్ గ్రే, లైట్ గ్రీన్, ఆరెంజ్ అనే మూడు ఆకర్షణీయ రంగుల్లో లభ్యమవుతుంది. ఇక అమెరికాలో USD 59 (సుమారు రూ. 5,035), యూరప్ లో 49.95 యూరోలు (ఆఫర్ ధర: 39.95 యూరోలు), యూకే ధర 39 GBP (ఆఫర్ ధర: 34 GBP)గా నిర్ణయించారు. భారతదేశంలో పూర్తి వివరాలు, ధరలు ఏప్రిల్ 28న అధికారికంగా వెల్లడించనున్నారు. వినియోగదారులకు మెరుగైన ధ్వని అనుభూతిని అందించేలా ఈ బడ్స్ రూపొందించబడినట్లు నథింగ్ తెలిపింది.