విభజన అంశాలపై రేపు ఢిల్లీలో భేటీ
ఏపీ, తెలంగాణకు సంబంధించి అపరిష్కృతంగా అనేక సమస్యలు ఉండిపోయాయి. విభజన సమస్యలపై కేంద్రంతో గతంలో చర్చలు జరిగాయి.కొన్ని అంశాల్లో కొన్ని ఆర్డర్లు ఇచ్చాయి.తెలంగాణ ఏపీకి ఇవ్వాల్సిన జెన్కో బకాయిలపై కేంద్రం ఆదేశాలిచ్చింది.దీనిపై తెలంగాణ కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంది.. అది వేకెట్ అయింది.ఢిల్లీలో వివిధ అంశాలపై కొంత క్లారిటీ తేవడానికి ప్రయత్నించాం.మార్చి నెలాఖరులోగా వివిధ సమస్యల పరిష్కారం వస్తుందని భావించాం అన్నారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి. మళ్లీ ఢిల్లీకి వెళ్తున్నాం.. కేంద్ర అధికారులతో చర్చలు జరుపుతాం.ఆ చర్చలు జరుగుతున్న సందర్భంలో సీఎం కూడా హాజరు కావాల్సివ పరిస్థితి ఉండే అవకాశం ఉంది.మా సూచన మేరకు సీఎం వ్యక్తిగత పర్యటన వేసుకున్నారు.మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది కాబట్టే ఈ సమాచారాన్ని తెలుపుతున్నాం.వివిధ సందర్భాల్లో ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి.దానిపై క్లారిటీ ఇస్తున్నాం.రెవెన్యూ డెఫిసిట్.. పోలవరం అంశాలపై చర్చలు జరుపుతున్నాం.రేపు మేం ఢిల్లీ వెళ్తున్నాం.అవసరమైతే సీఎం జగన్ ఢిల్లీకి వస్తారన్నారు సీఎస్ జవహర్ రెడ్డి. నిధుల్లేకే ఇటీవల జరగాల్సిన జగనన్న వసతి దీవెన కార్యక్రమం వాయిదా వేశాం….ఆర్థిక శాఖ సూచనల మేరకు వసతి దీవెనను వాయిదా వేశాంసంక్షేమ క్యాలెండర్ ప్రకారం కార్యక్రమాల అమలుకు నిధులతో ఇబ్బంది లేకుండా చూస్తాం అన్నారు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి.
జగనన్నే మా భవిష్యత్తుకి ఊహించని స్పందన
ఏపీలో చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమం 11 రోజుల పాటు కొనసాగింది. ఈ నెల 11వ తేదీన ప్రారంభమయిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఊరూరా, వాడవాడలా ముందుకి సాగిందని వైసీపీ తెలిపింది. 78 లక్షల గృహాలకు ఈ కార్యక్రమం సాగింది. మొత్తం 59 లక్షలమంది 82960-82960 నెంబర్ కి మిస్డ్ కాల్స్ ఇచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని వైసీపీ వెల్లడించింది. 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు కలసికట్టుగా ఇంటింటికీ వెళ్తున్నారు. జగనన్న ప్రతినిధులుగా వచ్చిన వీరందరినీ.. తమ ఇంటికి బంధువులొచ్చినంత సంబరంగా ప్రజలు చిరునవ్వుతో ఆహ్వానించారు. కొన్ని ఊళ్లలో అయితే ఎంతో సంబరంగా, మేళతాళాలతో ఎదురేగి ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. గ్రామాలు మొదలు పట్టణాల వరకు ‘మా నమ్మకం నువ్వే జగన్’ నినాదం మార్మోగింది.వైయస్ జగన్ పాలనపై తమకు నమ్మకం ఉందన్నారు ప్రజలు. భవిష్యత్తులో కూడా మళ్లీ ఆయన పాలనే కావాలని, రావాలని ప్రజలు అంతా విశ్వసించడంతో పాటుగా ప్రభుత్వానికి మద్దతుగా వారి ఫోన్ల ద్వారా మిస్డ్ కాల్స్ ఇచ్చి కుటుంబాలు అన్నే పూర్తి స్థాయి మద్దతు తెలిపాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఈ కార్యక్రమానికి బ్రహ్మరథం పట్టారని వైసీపీ నేతలు తెలిపారు.ఏ ఇంటికి వెళ్లినా ఆత్మీయ పలకరింపులు, ప్రభుత్వ పనితీరుపై ఎవరిని కదిపినా హర్షాతిరేకాలు.. మళ్లీ జగనన్నే సీఎం కావాలన్నది తమ ఆకాంక్ష అంటున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఇంటి తలుపు, మొబైల్ ఫోన్‌కు వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్‌లను ఇష్టంగా అతికించుకున్నారు.82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు తెలిపారు. ఆ వెంటనే ఐవీఆర్‌ఎస్ కాల్ ద్వారా సీఎం వైయస్ జగన్ సందేశం రావడంతో ఆనందపడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షల్లో మిస్ట్ కాల్స్ వచ్చాయంటే స్పందన ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు అని పార్టీ నేతలు చెబుతున్నారు.
వివేకా కేసులో విచారణ పేరుతో హై డ్రామా
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ హడావిడి చేస్తోందన్నారు. కేసు ముగింపుకు వచ్చినట్లు చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు.సీబీఐ వాడుతున్న పదాలు, వాడుతున్న మాటలు చూస్తే టీడీపీ రాజకీయ అజెండా అర్ధం అవుతుంది. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే అంశాన్ని కల్పిత కథను నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబును అర్జెంటుగా అధికారంలో కూర్చోబెట్టాలన్నది వీళ్ళ ప్రయత్నం.హత్య చేసిన నిందితుడు తాను ఎంత కర్కశంగా హత్య చేశాడో చెప్పాడు.రాజకీయంగా ఇది టీడీపీ దివాళాకోరుతనం. తాము ఏం చేశామో చెప్పుకోవటానికి టీడీపీ కి ఏమీ లేదు. అందుకే జగన్ వ్యక్తిత్వహననానికి చంద్రబాబు పాల్పడుతున్నారు.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పై కూడా ఇలానే చేశారు. వివేకా కేసును ఎజెండాలో భాగంగానే టీడీపీ వాడుకుంటుందివిచారణ పేరుతో ఒక డ్రామా జరుగుతోంది. రాంసింగ్ ఏకపక్షంగా విచారణ చేశారు.
బీజేపీ అభ్యర్థికి నిరసన సెగ..అభివృద్ధిపై మంత్రికి చేదు అనుభవం
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో సమయం దగ్గర పడిన నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. నియోజకవర్గాల్లో తిరుగుతూ ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో కొందరికి నిరసన సెగ ఎదురవుతోంది. మే 10న కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్యతో తలపడనున్న బీజేపీ నేత వీ సోమన్నకు ఈరోజు ప్రచార పర్వంలో ఇబ్బంది ఎదురైంది. సోమన్న మైసూరు జిల్లాలోని వరుణ నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండగా ఒక వర్గం ప్రజలు ఆయనను చుట్టుముట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదని ప్రశ్నించారు. హౌసింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ మంత్రిగా పనిచేసిన ఆయన.. మైసూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు. మంత్రిని చుట్టుముట్టిన గ్రామస్థులు నియోజకవర్గంలోని అభివృద్ధిపై నిలదీశారు. మైసూరు ఎంపీ ప్రతాప్‌సింహ సహా పలువురు బీజేపీ నేతలు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు.
ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట.. 25వరకూ అరెస్ట్ వద్దన్న హైకోర్ట్
కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 25 వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. వైఎస్ అవినాష్ రెడ్డి (Mp AvinashReddy) ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అవినాష్ కి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ఇదిలావుండగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు అవినాష్ ని విచారిస్తామన్న సీబీఐ విచారణ రేపటికి వాయిదా వేసింది. హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున రేపు ఉదయం 10.30 గంటలకు అవినాష్ రెడ్డిని విచారిస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది.ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈనెల 25 వరకు అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 25 వరకు ప్రతి రోజూ అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకావాలని, సీబీఐ విచారణకు పూర్తిగా సహకరించాలని తెలంగాణ హైకోర్ట్ ఆదేశించింది. అవినాష్ విచారణ ఆడియో, వీడియో రికార్డు చేయాలని సూచించింది. ఈనెల 25న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తుది తీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపింది. ఇప్పటికే వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్ కుమార్‌రెడ్డిని సీబీఐ కోర్టు ఆరు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. వాళ్ళిద్దరితో కలిపి అవినాష్‌రెడ్డిని ప్రశ్నిస్తామని సీబీఐ కోర్టుకు వెల్లడించింది.
కాసరగోడ్ వరకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పొడిగింపు
కేరళ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఇప్పుడు కాసరగోడ్ వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు. తొలుత ఈ సర్వీసు కన్నూర్‌లో ముగియాల్సి ఉంది. కేంద్ర మంత్రి వి మురళీధరన్ అభ్యర్థన మేరకు సర్వీసు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 25న కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని ప్రారంభిస్తారు. సోమవారం ట్రయల్ రన్ సమయంలో, ఎక్స్‌ప్రెస్ తిరువనంతపురం నుండి ఉదయం 5:10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:20 గంటలకు కన్నూర్ చేరుకుంది. 502 కిలోమీటర్లు ప్రయాణించేందుకు 7 గంటల 10 నిమిషాల సమయం పట్టింది.వందేభారత్ రైలు తిరువనంతపురం నుండి ఉదయం 5.10 గంటలకు బయలుదేరుతుంది. రైలు మధ్యాహ్నం 12.30 గంటలకు కన్నూర్ చేరుకుంటుంది. కాసర్‌గోడ్‌కు సర్వీస్ ను పొడిగించినందున, సవరించిన టైమ్‌టేబుల్‌ను త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. తిరువనంతపురం-కన్నూరు ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో భోజనం కలిపి రూ. 2,400. తిరువనంతపురం-కన్నూరు ఎకానమీ కోచ్‌లో ఆహారంతో సహా రూ.1,400.గా నిర్ణయించారు. వందేభారత్‌లో ఒక్కొక్కటి 78 సీట్లతో 12 ఎకానమీ కోచ్‌లు ఉన్నాయి. ఒక్కొక్కటి 54 సీట్లతో 2 ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు ఉన్నాయి. ఒక్కో కోచ్‌లో ముందు మరియు వెనుక 44 సీట్లు ఉంటాయి.
టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. బ్యాటింగ్‌కు దిగిన ముంబై
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా మంగళవారం (18-04-23) ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇది 25వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో భాగంగా తొలుత సన్‌రైజర్స్ జట్టు టాస్ గెలవగా, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. ముంబై జట్టు బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు నాలుగేసి మ్యాచ్‌లు ఆడాయి. ఇరు జట్లూ తమ రెండు మ్యాచుల్లో ఓడిపోగా.. ఆ తర్వాతి రెండు మ్యాచుల్లో విజయం సాధించాయి. ఇప్పుడు ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో.. ఎవరు గెలుస్తారు? ఎవరు హ్యాట్రిక్ కొడతారు? అన్నది ఆసక్తిగా మారింది.గత మ్యాచ్‌లో కోల్‌కతాపై సెంచరీతో శివాలెత్తిన హ్యారీ బ్రూక్.. అదే ప్రదర్శనను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తే, ముంబై జట్టుకి మూడినట్టే! అతనితో పాటు కెప్టెన్ మార్ర్కమ్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఇద్దరి పుణ్యమా అని.. ఎస్ఆర్‌హెచ్ జట్టు బ్యాటింగ్ విషయంలో కాస్త పటిష్టంగానే తయారైంది. బౌలర్లకూ మంచి అనుభవమే ఉంది కానీ, తడబాట్లు కూడా జరుగుతున్నాయి.
వారితో వ్యభిచారం చేయిస్తూ అడ్డంగా దొరికిన హీరోయిన్
సినిమా ఒక రంగుల ప్రపంచం.. ఇక్కడ విహరించాలని ఎంతోమంది అమ్మాయిలు కలలు కంటారు. ఆ కలలను నెరవేర్చుకోవడానికి కష్టపడి ఇండస్ట్రీకి వస్తారు. ఆ సమయంలో చేతిలో డబ్బులేక, ఉండడానికి ఇల్లు లేక.. సినిమా మీద ఆశ చావక.. మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లే దారి లేక.. అడ్డదారులు తొక్కుతున్నారు. అలా ఎంతోమంది అమ్మాయిలు.. వ్యభిచారులుగా మారిన కథలు ఎన్నో చూశాం. ఇలాంటివారి డీన్ స్థితిని చూసి, అవకాశాలు ఇప్పిస్తామని, డబ్బులు ఇప్పిస్తామని రొంపిలోకి దింపుతున్నారు కొంతమంది. అందులో ఒకరే నటి ఆర్తీ మిట్టల్. క్యాస్టింగ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో పనిచేస్తూ.. పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసిన ఆమె.. డబ్బు కోసం దిగజారి ప్రవర్తించింది. తనలాగే హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలను, మోడల్స్ ను వ్యభిచారంలోకి దింపింది. వారికి డబ్బు ఇస్తానని, అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి.. వారిచేత వ్యభిచారం చేయిస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న మహారాష్ట్ర పోలీసులు.. ఆమెపై నిఘా పెట్టి.. ఒక ఇద్దరు అమ్మాయిలను మోడల్స్ గా పంపించి సీక్రెట్ ఆపరేషన్ చేయగా.. ఆ ఇద్దరి అమ్మాయిలను వ్యభిచారం చేయాలనీ ఆమె బలవంతం చేసింది.