ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్ జిల్లాలోని పోలీస్ బేస్ క్యాంపుపై నక్సలైట్లు మరోసారి దాడి చేశారు. గత మూడు రోజుల్లో నక్సలైట్లు పోలీసులపై దాడి చేయడం ఇది రెండోసారి. పోలీసు శిబిరంలో కాల్పులు జరిగినట్లు బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు. పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడపల్లి పోలీస్ క్యాంపుపై నక్సలైట్లు దాడి చేశారు.. పోలీసులు, నక్సలైట్ల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. బేస్ క్యాంపులో సైనికులకు ప్రథమ చికిత్స చేస్తున్నారు. ఈ దాడుల వెనుక కేంద్ర కమిటీ అగ్రనేత హిద్మా హస్తం ఉందని చెబుతున్నారు.
READ MORE: 7-Seater Car : కొత్త కారు కొనాలని చూస్తున్నారా? ఈ 7-సీటర్‌పై రూ.60వేలు తగ్గింపు!
ఇదిలా ఉండగా.. గత రెండ్రోజుల ముందు ఛత్తీస్ గఢ్-తెలంగాణ బార్డర్లోని జీడిపల్లి భద్రతా దళాల బేస్ క్యాంప్పై మావోయిస్టుల మెరుపు దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు మావోయిస్టులకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. 2024 డిసెంబర్ 5వ తేదీ అర్ధరాత్రి నుంచి భద్రతా దళాలకు, మావోయిస్టులకు భీకరంగా ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా రెండు రోజుల క్రితం బీజాపూర్ జిల్లాలోని పమేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లిలో భద్రతా దళాలు బేస్ క్యాంప్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
READ MORE:Peddapalli: చిల్లపల్లి గ్రామానికి అరుదైన గుర్తింపు..రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు..