మీరు కొత్త 7-సీటర్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. ఈ శుభవార్త మీ కోసమే. ప్రముఖ కార్ల తయారీదారు రెనాల్ట్ డిసెంబర్ 2024లో దాని అద్భుతమైన MPV ట్రైబర్‌పై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. రెనాల్ట్ ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 8.69 లక్షల వరకు ఉంటుంది. ఈ కారుపై కంపెనీ అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. కస్టమర్లు కారును రూ. 8999 EMIతో ఇంటికి తీసుకురావచ్చు. అయితే.. డిసెంబర్ నెలలో ఈ వాహనంపై రూ. 60,000 వరకు తగ్గింపు ఇస్తున్నారు. ఇందులో రూ. 25,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 20,000 లాయల్టీ క్యాష్ ఆఫర్ ఉన్నాయి. మీరు డిసెంబర్ 31లోపు ఈ ఆఫర్‌ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ గురించి మరింత సమాచారం కోసం మీరు డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. కాగా.. భారతీయ మార్కెట్లో ట్రైబర్.. మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా ఇన్నోవా వంటి కార్లతో పోటీపడుతుంది.
READ MORE: Buddha Venkanna: సీఎం చంద్రబాబుకు అన్ని కులాలు అండగా ఉన్నాయి: బుద్దా వెంకన్న
రెనాల్ట్ ట్రైబర్‌లో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. కారు ఇంజన్ గరిష్టంగా 71bhp శక్తిని, 96Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కారు ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. రెనాల్ట్ ట్రైబర్‌లో లీటరుకు 18 నుంచి 19 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కారు లోపలి భాగంలో కస్టమర్‌లు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతారు. ఇది కాకుండా.. కస్టమర్‌లకు 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, AC వెంట్స్, పుష్ బటన్ స్టార్ట్-స్టాప్, కార్ క్యాబిన్‌లోని సెంటర్ కన్సోల్‌లో కూల్డ్ స్టోరేజ్ వంటి ఫీచర్లు కూడా అందించారు. భద్రత కోసం, రెనాల్ట్ ట్రైబర్‌లో 4-ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌తో వెనుక పార్కింగ్ సెన్సార్ కూడా అమర్చారు.