ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో నక్సలైట్ల దాడిలో 8 మంది డీఆర్‌జీ జవాన్లు వీరమరణం పొందారు. ఈ జవాన్లకు మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో సైనికులకు అంతిమ వీడ్కోలు పలికారు. వారి త్యాగానికి నివాళులు అర్పించి, వారి త్యాగం వృథా కాకుండా చూస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్ జిల్లాలోని పోలీస్ బేస్ క్యాంపుపై నక్సలైట్లు మరోసారి దాడి చేశారు. గత మూడు రోజుల్లో నక్సలైట్లు పోలీసులపై దాడి చేయడం ఇది రెండోసారి. పోలీసు శిబిరంలో కాల్పులు జరిగినట్లు బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు. పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడపల్లి పోలీస్ క్యాంపుపై నక్సలైట్లు దాడి చేశారు.. పోలీసులు, నక్సలైట్ల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. బేస్ క్యాంపులో సైనికులకు ప్రథమ చికిత్స చేస్తున్నారు. ఈ…