చాలా మందికి విమానం అంటే భయం. సురక్షితంగా దిగే వరకు గుండె చప్పుడు ఆగదు. అలాంటి సమయంలో ఏదైనా సమస్య వస్తే. ఇక ప్రయాణికుల భయానికి అంతుండదనే చెప్పొచ్చు. ప్రాణాలతో బయటపడతామనే ఆశకూడ వారు కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనే ఇటలీలో చోటుచేసుకుంది. విమానం బయలుదేరే సమయంలో బోయింగ్ కంపెనీకి చెందిన బోయింగ్ 747 డ్రీమ్‌లిఫ్టర్ దాని ప్రధాన చక్రాలలో ఒకదాన్ని కోల్పోయిన షాకింగ్ క్షణాన్ని చూపించే దృశ్యాలు వెలువడ్డాయి. మంగళవారం ఉదయం దక్షిణ ఇటలీలోని టరాంటో నుంచి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే జెయింట్ బోయింగ్ కో-కార్గో జెట్ నుండి ఒక చక్రం పడిపోయి నేలమీద పడింది.
టేకాఫ్ సమయంలో బోయింగ్ విమానం చక్రాన్ని కోల్పోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోలో, ఇటలీలోని టరాన్టో నుండి విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు బోయింగ్ 747-400 డ్రీమ్‌లిఫ్టర్ విమానం చక్రాలు పడిపోతున్నట్లు చూడవచ్చు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కార్గో ఎయిర్‌క్రాఫ్ట్ అయిన 180-టన్నుల బోయింగ్ డ్రీమ్‌లిఫ్టర్ నుండి 100 కిలోల విమానం చక్రం నేలపై పడిపోతున్న క్షణాన్ని వీడియో క్లిప్ చూపిస్తుంది.
చక్రం వదులుగా రావడంతో కార్గో జెట్ అండర్ క్యారేజ్ నుండి నల్లటి పొగ రావడం కనిపిస్తుంది. ఆ తర్వాత అది నేలను తాకి విమానం కిందకు దూసుకెళ్లింది. తప్పిపోయిన భాగం టరాన్టో-గ్రోటాగ్లీ విమానాశ్రయానికి సమీపంలోని వైన్యార్డ్‌లో కనుగొనబడినట్లు నివేదికలు తెలిపాయి. బోయింగ్ ఈ సంఘటనను ధృవీకరించింది. అట్లాస్ ఎయిర్ నిర్వహిస్తున్న డ్రీమ్‌లిఫ్టర్ కార్గో ఫ్లైట్ అక్టోబర్ 11న ఉదయం ఇటలీలోని టరాన్టో-గ్రోటాగ్లీ విమానాశ్రయం నుండి టేకాఫ్ చేస్తున్నప్పుడు ల్యాండింగ్ గేర్ నుండి వీల్ అసెంబ్లింగ్‌ను కోల్పోయిన తర్వాత చార్లెస్టన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపింది. ప్రయాణికులు సురక్షితంగా బయట పడటంతో.. అందరూ ఊపిరిపీల్చుకున్నారు.