Mudragada Padmanabham: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జనసేన వైపు చూస్తున్నారనే వార్తలు వచ్చాయి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకిలో వెళ్లేది లేదని ఆయన స్పష్టం చేశారు.. ఆ తర్వాత జనసేన పార్టీ నేతలు ఆయన్ని కలవడం.. త్వరలోనే పవన్ కల్యాణ్.. ముద్రగడ దగ్గరకు వచ్చి కలుస్తారని.. పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం సాగింది.. అయితే, పవన్ కల్యాణ్.. రాజమండ్రి పర్యటనలో ఉన్న వేళ.. పవన్ రాకపై సంచలన వ్యాఖ్యలు చేశారు ముద్రగడ్డ పద్మనాభం.. పవన్ కల్యాణ్ రాజమండ్రి వచ్చిన విషయాన్ని ముద్రగడ దగ్గర ప్రస్తావించారట అనుచరులు.. దీంతో, పవన్ రాకపై ముద్రగడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. మనం చెప్పాల్సింది చెప్పాం తర్వాత మనం చేసేది ఏమి లేదన్న ముద్రగడ.. వస్తే ఒక నమస్కారం.. రాకపోతే రెండు నమస్కారాలు అంటూ సంచలన కామెంట్ చేశారట..
Read Also: Top Headlines @ 5 PM : టాప్ న్యూస్
కాగా, గత నెల ముద్రగడ పద్మనాభం నివాసానికి రెండుసార్లు వెళ్లారు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్.. త్వరలోనే పవన్ కల్యాణ్ కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తారని ఈ సందర్భంగా బొలిశెట్టి చెప్పుకొచ్చారు.. అయితే, పవన్ కల్యాణ్ తన నివాసానికి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తానని బొలిశెట్టికి చెప్పారు ముద్రగడ.. కానీ, దాదాపు నెలరోజులు దాటిన ముద్రగడ నివాసానికి పవన్ కల్యాణ్ వెళ్లే వ్యవహారంపై ప్రతిష్టాంభన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ముద్రగడ తన అనుచరుల దగ్గర చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.