వంగవీటి రాధాకృష్ణ అలియాస్ వంగవీటి రాధా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌తో సమావేశం కాబోతున్నారు.. 11 నెలల తర్వాత నారా లోకేష్, వంగవీటి రాధా భేటీ జరుగుతోన్న నేపథ్యంలో.. విషయం ఏమై ఉంటుంది? అనే చర్చ ఆసక్తికరంగా మారింది.
తోట త్రిమూర్తులు, వైసీపీ ఎమ్మెల్సీ.. గతంలో రామచంద్రపురం ఎమ్మెల్యేగా కూడా పనిచేశారాయన. అప్పటి పరిణామాలను బట్టి వేర్వేరు పార్టీల తరపున ప్రాతినిధ్యం వహించారు. అయితే... గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు మండపేట నుంచి తొలిసారి బరిలో దిగి ఓడిపోయారు త్రిమూర్తులు. అయితే ఇప్పుడాయన లెక్కలు పూర్తిగా మారిపోతున్నట్టు తెలుస్తోంది. మొదట్నుంచి రాజకీయం కంటే తనకు కులమే ముఖ్యమని చెప్పే తోట త్రిమూర్తులు...
కాపు ఉద్యమ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ముద్రగడ పద్మనాభం పేరు మార్పు వ్యవహారాన్ని కొందరు రెడ్డీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. అనపర్తి మండలం కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రి వెంకట రామారెడ్డి దీనిపై ఓ లేఖ విడుదల చేయడం హాట్ టాపిక్‌గా మారింది.. లేఖ విడుదల చేయడంతో పాటు.. ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో వదిలారు కర్రి వెంకట రామారెడ్డి.