Mudragada Padmanabha Reddy: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంను కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇక ఆసుపత్రిలో కిడ్నీకి సంబంధించి డయాలసిస్ ట్రీట్మెంట్ అందించారు డాక్టర్లు. అయినా మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకుని వెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే, హైదరాబాద్ వెళ్లే ముందు ఒకసారి ఇంటికి వెళ్లాలని ఉందని కిర్లంపూడి తీసుకుని వెళ్లాలని పద్మనాభం కోరారు. దాంతో కాకినాడ నుంచి కిర్లంపూడి కూడా తీసుకుని వెళ్లారు. ఇంటిదగ్గర కొద్దీ నిమిషాల పాటు…
Mudragada Padmanabham: కాపు సంఘం నాయకుడు, మాజీ మంత్రి, వైసీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగానే ఉందని ముద్రగడ తనయులు బాలు, గిరిబాబు తెలిపారు. ఇక, మా తండ్రి ఆరోగ్యం పట్ల వస్తున్న వదంతులు నమ్మవద్దు అని సూచించారు.
క్రాంతి..... వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనకు మద్దతిచ్చి... ఎలక్షన్ తర్వాత పార్టీలో చేరారామె. ఇప్పుడిక డైరెక్ట్‌గా తండ్రి, తమ్ముడు గిరి టార్గెట్‌గా పొలిటికల్ కామెంట్స్ చేయడం సంచలనం అవుతోంది. ఆమె పొలిటికల్ మూవ్‌మెంట్స్‌పై రకరకాల విశ్లేషణలు పెరిగిపోతున్నాయి. ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్‌గా ఉన్నారు ముద్రగడ గిరి. అటు పద్మనాభం కొడుకుని సపోర్ట్ చేస్తూ... నాయకుడిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి యాక్టివ్ అవుతున్నారు. పరామర్శల పేరుతో నిత్యం ప్రజలను కలుస్తున్నారు. అంతేకాదు ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. క్రాంతి నిత్యం జనాల్లో ఉంటూ.. ప్రజాదరణ పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో క్రాంతి జనసేన కీలక పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన ఇంఛార్జి వరుపుల తమ్మయ్య బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రత్తిపాడు ప్రభుత్వ…
Mudragada Padmanabha Reddy: మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రెడ్డి తాజాగా ఓ భారంగా లేఖను విడుదల చేసారు. ఈ లేఖలో ఆయన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ఇక ఆయన విడుదల చేసిన బహిరంగ లేఖలో.. ఈ మద్య మాకుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు ఆ కుటుంబానికి, మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్దలు వచ్చాయి. ఒక సంవత్సరము నుండి పూర్తిగా అన్ని రకాల రాకపోకలు బంద్ అయ్యాయని..…
కాపు ఉద్యమనేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ముద్రగడ పద్మానాభం క్యాన్సర్‌తో బాధపడుతున్నారట.. ఈ విషయం తెలిసి.. తన తండ్రిని కలిసేందుకు వెళ్లిన ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతిని అడ్డుకున్నారట కుటుంబ సభ్యులు.. ముద్రగడను కలిసేందుకు ఆయన కుమారుడు గిరి నిరాకరించాడట.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి..
2014 - 19 మధ్య కాలంలో జరిగిన తుని రైలు దగ్ధం కేసులో కాపు నేత ముద్రగడ పద్మనాధం సహా మరో 40 మందిపై అప్పట్లో కేసు నమోదైందని.. ఆ తర్వాత సరైన సాక్ష్యాలు లేకపోవటంతో కోర్టు కొట్టివేసిందని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు.. అప్పటి ఘటనపై తాజాగా ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లాలనుకుందని చెప్పారు.. సీఎం చంద్రబాబుకు కాపులు అంటే ఎందుకంత కోపం..? అని ప్రశ్నించారు. కాపులను బీసీల్లోకి చేరుస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు…
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర జరిగిన దాడి ఘటనపై మాజీమంత్రి అంబటి రాంబాబు స్పందించారు. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఇంటి గేటును ట్రాక్టర్ తో గుద్ది డ్యామేజ్ చేశారన్నారు.
ముద్రగడ లాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. కాపుల కోసం, కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన వ్యక్తి ముద్రగడ అని ఆయన కొనియాడారు.