ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా ఊర మాస్ ప్రాజెక్ట్ ‘సలార్’ పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. కెజియఫ్ తర్వాత హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘సలార్’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. సెప్టెంబర్ 28న ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి థియేటర్లోకి రానుంది. ఎప్పుడో లాక్ చేసిన రిలీజ్ డేట్ ప్రకారం సలార్ విడుదలకి ఇంకో నాలుగు నెలల సమయం కూడా లేదు, ఇంత తక్కువ సమయం ఉన్నా కూడా ఈ మధ్య సలార్ గురించి ఎలాంటి అప్డేట్స్ బయటికి రావడం లేదు. రీసెంట్‌గా శ్రియ రెడ్డి… ఈ సినిమాలో తాను పవర్ ఫుల్ రోల్ చేస్తున్నానని మాత్రమే చెప్పుకొచ్చింది. అదొక్కటే ఇటీవలే సలార్ నుంచి సినీ అభిమానులకి అఫీషియల్ గా తెలిసిన అప్డేట్. ప్రశాంత్ నీల్, హోంబలే ఫిలింస్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. కనీసం ఇప్పటి వరకు సలార్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయలేదు. అసలు సలార్ షూటింగ్ ఎంత వరకు వచ్చింది? అనే క్లారిటీ కూడా లేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల ప్రకారం సలార్ షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయిపోయినట్టు తెలుస్తోంది.
ఇటీవలే ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసిన ప్రభాస్, సలార్ సినిమా పనులని ముగించుకున్నాడు. ఏడాదిన్నరగా జరుగుతున్న సలార్ కంప్లీట్ అవ్వడం ఫాన్స్ కి చాలా మంచి గుడ్ న్యూస్, అయితే ఇక్కడ ఇంకో బాడ్ న్యూస్ కూడా ఉంది. జూన్ 16న గ్రాండ్‌గా ఆదిపురుష్ రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం అంతా ఆదిపురుష్ గురించే చర్చించుకుంటున్నారు మూవీ లవర్స్. ఇలాంటి సమయంలో.. సలార్ అప్డేట్ బయటికొస్తే.. ఆదిపురుష్ హవా తగ్గే ఛాన్స్ ఉంది. అందుకే ఆదిపురుష్ రిలీజ్ వరకు సలార్ అప్డేట్ బయటికొచ్చే ఛాన్సే లేదు. కానీ ఆదిపురుష్ థియేటర్లో సలార్ టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ టీజర్ అనౌన్స్మెంట్.. ఆదిపురుష్ రిలీజ్ ముందు రోజు ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ నిజంగానే.. ఆదిపురుష్‌తో పాటే సలార్ టీజర్ రిలీజ్ చేస్తే.. బాక్సాఫీస్ బద్దలైపోతుంది. ఆదిపురుష్ ఓపెనింగ్స్ ఊహించని విధంగా ఉంటాయని చెప్పొచ్చు.