జగిత్యాల జిల్లాలో ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మద్దతు ఇచ్చి..అండగా నిలిచి, ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రం లో ని బట్టివాడ లో కాంగ్రెస్ జెండా ఎగురవేసి ప్రచారం ప్రారంభించారు జీవన్‌రెడ్డి. కాంగ్రెస్ జెండాలతో.. ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. పార్టీలకు అతీతంగా, అన్ని వర్గాల ప్రజలను పలుకరిస్తూ.. ఎన్నికల ప్రచారం సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. జగిత్యాల కాంగ్రెస్ లో పోటీ చేయడానికి ప్రత్యామ్నయం ఎవరూ లేరు కాబట్టి పోటీ చేసే బాధ్యత నాపై పడేలా ఉందన్నారు. ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై నిర్ణయం కాలేదని, పోటీ చేసే విషయంలో పార్టీ తీసుకొనే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానన్నారు.
Also Read : Himachal Pradesh: వరదలతో హిమాచల్ అతలాకుతలం.. రూ.200 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
పార్టీ పరంగా ప్రత్యామ్నయం ఏదైనా ఉంటే వేరే వాళ్లకు అప్పజెప్పి నేను పక్కకు తప్పుకునే వాణ్ణి అని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ధైర్యం కావాలని, పరిస్థితులు ముందు ఉన్నట్టు లేవని ఆయన వ్యాఖ్యానించారు. నేను ఆరోగ్యంగా ఉన్నాను.. కాబట్టి పోటీ చేయడం పక్కా అని ఆయన అన్నారు. ప్రత్యామ్నాయం లేదు కాబట్టి నేను పోటీ చేయడం తప్పనిసరి అయిందని ఆయన ఉద్ఘాటించారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో జగిత్యాల అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే జగిత్యాల ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. తాను ఎన్నికల్లో ఓడినా గెలిచినా ఇంతకాలం ప్రజల మధ్యనే ఉన్నానని ఇకముందు కూడా అలాగే ఉంటానని స్పష్టం చేశారు.
Also Read : Vellampalli Srinivas: లోకేష్ చేసేది ఈవినింగ్ వాక్.. యువగళంకు ప్రజాదరణ లేదు