రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు లేవనెత్తారు సీతక్కని ఓడిస్తామని, ప్రజాసేవకు డబ్బు సంచులకు మధ్య ఎన్నికల యుద్ధం మొదలవుతుందన్నారు ఎమ్మెల్యే సీతక్క. ఇవాళ ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీతక్క మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెను మాట్లాడుతూ.. నేను ప్రతిపక్షంలో ఉన్న ప్రజలతోటే ఉన్న ఎక్కడ భూకబ్జాలు పాల్పడలేదు, అక్రమ కేసులు పెట్టించలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదని ఆమె అన్నారు. మిడతల దండులాగా బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారని, నన్ను ఓడించడానికి డబ్బు సంచులతో తిరుగుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ మంత్రులకు పక్క నియోజకవర్గాల మీద ఉన్న ప్రేమ ములుగు మీద ఉండటం లేదని, ప్రశ్నించే గొంతును చట్టసభలోకి రాకుండా అడ్డుకోవడానికి భారీ కుట్రకు తెరలేపుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టం ఎక్కడున్నా సీతక్క అక్కడఉంటుందని, ప్రజలలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక నన్ను టార్గెట్ చేస్తున్నారని ఆమె అన్నారు.
Also Read : Siva Nirvana: ఖుషీ కోసం శివ నిర్వాణకి 12 కోట్ల రెమ్యునరేషన్.. అసలు సంగతి చెప్పేశాడు!
సీతక్క బాగా పనిచేస్తుందని అసెంబ్లీలో పొగుడుతున్నారు ఇక్కడికొచ్చి ఓడించుమంటున్నారని, ఏం తప్పు చేశానని నన్ను టార్గెట్ చేస్తున్నారు ప్రజల మధ్యనే ఉండడం నేను చేస్తున్న తప్ప అని ఆమె ప్రశ్నించారు. ములుగు ప్రజల ఆత్మగౌరానికి డబ్బు సంచులతో ముడి పెడుతున్నారని, ప్రజలే నా కుటుంబం నియోజకవర్గమే నా ఇల్లు అని ఆమె వ్యాఖ్యానించారు. నియోజకవర్గ ప్రజలే నన్ను ఆశీర్వదిస్తారని, బీఆర్ఎస్ నాయకులంతా దండయాత్రలు చేసి ములుగును భయాందోళన గురిచేస్తున్నారని ఆమె అన్నారు.
Also Read : K.Raghavendra Rao: ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన దర్శకేంద్రుడు