Director Shiva Nirvana’s Remuneration For Kushi Movie: నిన్ను కోరి, మజిలీ వంటి సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ జగదీష్ లాంటి మాస్ సబ్జెక్టు కూడా చేయగలను అని నిరూపించుకున్నాడు. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన టక్ జగదీష్ సినిమా పూర్తిస్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. త్వరలోనే విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లు తెరకెక్కిన ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శివ నిర్వాణ మీడియాతో మాట్లాడుతూ ఈ ఖుషి సినిమాకి రెమ్యూనరేషన్ గురించి స్పందించాడు. ఖుషి ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ సినిమా కోసం తనకు ఏకంగా 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందనే విషయం తన దృష్టికి కూడా వచ్చిందని అన్నారు. విజయ్ దేవరకొండకు 20 కోట్లకు పైగా సమంతకు మూడు కోట్లు తనకు 12 కోట్లు ఇచ్చారని తన స్నేహితులు తన దృష్టికి తీసుకువచ్చారని సైలెంట్ గా కనిపిస్తావు ఇన్ని కోట్లు వెనకేస్తున్నావా అని వారు సరదాగా ఆట పట్టించారని ఆయన చెప్పుకొచ్చారు.
Kushi: ఖుషీ సమంత రియల్ లైఫ్ స్టోరీనా.. శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్?
అన్నేసి కోట్ల రెమ్యునరేషన్ ఇస్తే ఇంకా సినిమా తీయడానికి ఏముంటుంది అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఇక ఈ సినిమా కోసం అన్ని పాటలకు తానే లిరిక్స్ రాశానని అబ్దుల్ వాహబ్ తో ఒక వైబ్ క్రియేట్ అవ్వడంతో అలా అన్ని పాటలకు తానే లిరిక్స్ ఇచ్చేసానని చెప్పుకొచ్చారు. ఒకానొక దశలో మా అమ్మ కూడా నేను అన్ని కోట్లు తీసుకుంటున్నానేమో అని పొరపడిందని ఆమెకు చుట్టుపక్కల వాళ్ళు చెప్పడంతో నిజంగానే అన్ని కోట్లు ఇస్తున్నారా అని ఫోన్ చేసి అడిగిందని చెప్పుకొచ్చారు. 12 కోట్ల రూపాయలు తీసుకోవడం లేదు అని శివ నిర్వాణ వెల్లడించారు. కానీ ఈ సినిమాకి ఎంత తీసుకున్నారు అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. అంతేకాక ఈ సినిమా తర్వాత ప్రాజెక్టు ఎవరితో ఉంటుందనే విషయం కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత చెబుతానని అప్పటి వరకు సస్పెన్స్ అని చెప్పుకొచ్చారు.