Ponguleti Srinivasa Reddy: నేడు (ఆగష్టు 7) ఖమ్మం పాలేరు మినీ హైడల్ ప్రాజెక్టు అధికారులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రేడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పాలేరు మిని హైడల్ విద్యుత్ కేంద్రం గేట్లు తెరిచి విద్యుత్ ఉత్పాదన కు సిద్ధం చేయని అధికారులపై ఆయన మండి పడ్డాడు. జీతాలు తీసుకుంటున్నారుగా.. కనీసం పనిచేయలేరా… పవర్ జనరేషన్ కు ఎందుకు సిద్ధం కాలేదు… అంటూ ఖమ్మం పాలేరు మినీ హైడల్ ప్రాజెక్టు అధికారులపై మంత్రి ఆగ్రహించారు. ఈనెల 15 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టును ప్రారంభం కానుందని., పాలేరు నియోజకవర్గంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ చెరువులు పూర్తి స్థాయిలో నిండలేదని., ఇప్పుడు విడుదల చేసిన సాగర్ జలాలను అవసరమైన మేరకు పంటలకు వాడుకోవడం తోపాటు చెరువులను కూడా నింపుతాం అని ఆయన అన్నారు.
Cyber Crime: సైబర్ మోసంలో ఇరుకున్న ప్రభుత్వ ఉద్యోగి.. 40 వేలు స్వాహా..
పాలేరు ఎడమ కాలువ నుంచి విడుదల చేసిన నీరు తెలంగాణా లో 2లక్షల 75 వేల ఎకరాలు, ఆంధ్రాలో 1లక్ష 20 వేల ఎకరాలకు అందుతుందని., గత సీజన్ లో డ్యాముల్లో తగినంత నీరు లేకపోవడంతో ఒక పంటకే నీటిని విడుదల చేశారని., దేవుళ్ళు దీవించబట్టే ఇందిరమ్మ రాజ్యంలో రెండు పంటలకు సరిపడా నీరు వచ్చిందని., కృష్ణా బేసిన్ లో నీటి కొరత ఏర్పడితే సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించేందుకు వీలైనంత తొందరగా పూర్తి చేస్తాం అని అన్నారు.
Harish Rao: గాల్లో దీపం లాగా ప్రభుత్వ పాలన ఉంది.. మాజీ మంత్రి..