Harish Rao: తాజాగా తెలంగాణ భవన్ లో హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలతో ఇక్కడ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన వాపోయారు. అలాగే ఈ అంశంపై ఆయన అనేక కామెంట్స్ చేసారు. ఇక మరోవైపు.. రేవంత్ రెడ్డి హయాంలోని ప్రభుత్వం గాల్లో దీపం లాగా ప్రభుత్వ పాలన వుందటూ ఆయన వ్యాఖ్యానించారు మాజీ మంత్రి.. ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్ల మన విద్యార్థులు నష్ట పోతున్నారని., అర్థం కాకపోతే అఖిలపక్షం పిలవండి.., మన విద్యార్థులకు మన రాష్ట్రంలో సీట్లు వచ్చే విధంగా చేయండి., 9,10, 11,12 తరగతులు ఇక్కడ చదివితే ఇక్కడ లోకల్ అవుతారు.. కర్ణాటకలో మెడిసిన్ చదివి వచ్చిన మన విద్యార్థులు ఇక్కడ పీజీ చదవాలి అంటే నాన్ లోకల్ అవుతారు. పరిపాలనా వైఫల్యం వల్ల ఇది జరుగుతుందని ఆయన అన్నారు.
Harish Rao: తెలంగాణ వాళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.. హరీష్ రావు..
ఇక రాష్ట్రంలో ప్రభుత్వం పచ్చదనం – స్వచ్చదనం అనే ప్రోగ్రాం చేస్తుందని., కానీ ఒక్క రూపాయి కూడా ఈ ప్రోగ్రాం కోసం ఇవ్వలేదని., మొదటి రోజు సమస్యలను నోట్ చేసుకోవాలని.. రెండో రోజు బ్లీచింగ్ పౌడర్ లాంటివి చల్లాలి అన్నారు. వాటి కోసం డబ్బులు విడుదల చేయలేదని., గ్రామ పంచాయతీలల్లో డీజిల్ కు డబ్బులు లేక ట్రాక్టర్లు మూలకు పడ్డాయని.. రాష్ట్రంలో ఏ ఊరికి అయినా వెళ్లి చూసినా అదే పరిస్థితి కనిపిస్తోందని ఆయన అన్నారు. ఆలోచన లేకుండా ఈ ప్రోగ్రాం మొదలు పెట్టారని., నిధులు ఇచ్చి విధులు చేయమని చెప్పాలంటూ హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇవ్వాళ్టికి 8 నెలలు పూర్తి అయిందని., ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు 8 పైసలు కూడా ఇవ్వలేదంటూ ఆయన మాట్లాడారు.
Bangladesh: నోబెల్ విజేత యూనస్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం.. రేపే ప్రమాణస్వీకారం