Cyber Crime: ప్రస్తుతం టెక్నాలజీ ఎక్కువ వాడుతున్న నేపథ్యంలో అనేక పనులు చాలా త్వరగా జరుగుతున్న.. మరోవైపు దారుణాలు కూడా జరగుతున్నాయి. చాలామంది సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోతున్నారు. ఇలా మోసపోయిన వాళ్లు చాలానే డబ్బులను పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన విషయాలను ప్రతిరోజు మనం మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉంటాము. తాజాగా జగిత్యాల జిల్లాలో సైబర్ మోసం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
GVMC Standing Committee Elections: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా
జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలంలోని ఎంపీడీవో ఆఫీసులో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేసిన శివప్రసాద్ సైబర్ మోసానికి గురయ్యాడు. ఈ ఘటనలో ఆయన ఖాతా నుండి 40 వేలు రూపాయలను లూటీ చేశారు సైబర్ మోసగాళ్లు. ఇకపోతే ముందుగా శివప్రసాద్ తన వాట్సాప్ లో వచ్చిన ఓ లింకు అచ్చం బ్యాంకు లోగోను కలిగి ఉండడంతో ఆయన బ్యాంకు నుండి వచ్చిందని అనుకొని లింకు ఓపెన్ చేయగా.. అక్కడ ఏటీఎం డీటెయిల్స్ అడగడంతో ఆయన ఎంటర్ చేశాడు. ఇంకేముంది.. అరగంట తర్వాత సైబర్ నేరగాళ్ల బాధితుడు శివప్రసాద్ బ్యాంకు అకౌంట్ నుంచి మొత్తం 40 వేల రూపాయలను లూటీ చేశారు. విడతలవారీగా మొత్తం ఐదుసార్లు 5000 రూపాయలు చొప్పున ట్రాన్స్ఫర్ చేయగా., మరోసారి 15 వేల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసినట్లుగా అతనికి మెసేజ్లు అందాయి. దాంతో అతను మోసపోయానని గ్రహించిన బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును మొదలుపెట్టారు.
Harish Rao: తెలంగాణ వాళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.. హరీష్ రావు..